https://oktelugu.com/

Indian 3 : భారతీయుడు 3 ట్రైలర్ నెక్స్ట్ లెవల్లో ఉందిగా…ఈ సినిమా తో శంకర్ ఊచకోత మొదలు పెట్టబోతున్నాడా..?

ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్ లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ కెరియర్ మొదట్లోనే ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. రోబో సినిమా నుంచి గ్రాఫిక్స్ తో సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన ఆయన ఒక విజువల్ వండర్ ని తెరకెక్కించాడు. ఇక 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రీసెంట్ గా భారతీయుడు 2 అనే సినిమాను తీశాడు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ సినిమా ఎండింగ్ లో వేసిన భారతీయుడు 3 ట్రైలర్ మాత్రం గుజ్ బంప్స్ వచ్చేలా ఉందనే చెప్పాలి

Written By:
  • Gopi
  • , Updated On : July 13, 2024 / 09:35 PM IST
    Follow us on

    Indian 3 : భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే దర్శకుడు దగ్గర దమ్ము ఉండాలి. లేకపోతే మాత్రం ఆ సినిమాను హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు కూడా ఒక చిన్న పాయింట్ ను ఆసర గా చేసుకొని దాన్ని పెద్ద ప్రోడక్ట్ గా ఎలా మార్చాలి అనే విషయంలో చాలావరకు ప్రాక్టికల్ గా అవగాహన అయితే ఉండాలి. అలా లేకపోతే మాత్రం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది కూడా క్లారిటీ లేకుండా మన చేతుల్లో నుంచి జారిపోతుంది.

    ఇక ఇలాంటి క్రమంలోనే శంకర్ లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ కెరియర్ మొదట్లోనే ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాడు. రోబో సినిమా నుంచి గ్రాఫిక్స్ తో సినిమాలు చేయడం స్టార్ట్ చేసిన ఆయన ఒక విజువల్ వండర్ ని తెరకెక్కించాడు. ఇక 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా రీసెంట్ గా భారతీయుడు 2 అనే సినిమాను తీశాడు. ఇక ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ సినిమా ఎండింగ్ లో వేసిన భారతీయుడు 3 ట్రైలర్ మాత్రం గుజ్ బంప్స్ వచ్చేలా ఉందనే చెప్పాలి. నిజానికి భారతీయుడు 2 సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివరలో భారతీయుడు 3 ట్రైలర్ ని వదలడం అనేది మరొక ఎత్తు…ఇక ఇది భారతీయుడు సినిమాకి ఫ్రీక్వేల్ గా తెరకెక్కుబోతుందనే సమాచారం అయితే అందుతుంది.

    మనకు తెలిసి చాలా తక్కువ మంది బ్రిటిష్ వాళ్లతో పోరాడిన స్వతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం…దానికి ముందు కూడా సేనాపతి అనే క్యారెక్టర్ చాలామంది దేశద్రోహులతో పోరాడినట్టుగా ఈ ట్రైలర్ లో అయితే చూపించారు. ఇక ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవడం మాత్రం పక్క అంటూ ఈ ట్రైలర్ ను చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్నారు. నిజానికి ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాల్సిన సినిమానే కానీ అందులో వీళ్లకు తగ్గట్టుగా ఎమోషన్స్, ఎలివేషన్స్ ను ఆడ్ చేయలేకపోయారు. దానివల్లే ఈ సినిమా మొదటికే మోసం వచ్చిందనే చెప్పాలి.

    కానీ భారతీయుడు 3 సినిమా మాత్రం అలా ఉండదని మనకు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మొత్తానికైతే కమలహాసన్ శంకర్ ఇద్దరు కలిసి మరో ప్రభంజనాన్ని క్రియేట్ చేయబోతున్నారనేది మాత్రం చాలా క్లారిటీ గా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అలాంటి ట్రైలర్ అయితే మనం ఎక్కడ చూడలేదు. కమలహాసన్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నాడు. 2025 వ సంవత్సరంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తామంటూ ట్రైలర్ ఎండింగ్ లో వేశారు. మరి ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఎందుకంటే శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిపోయి రిలీజ్ అయిన తర్వాత భారతీయుడు 3 మీద ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ భారతీయుడు 3 సినిమా ఆల్మోస్ట్ 30% షూట్ కూడా కంప్లీట్ చేసుకుంది అంటూ శంకర్ రీసెంట్ భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చెప్పాడు. మరి తొందరగా గేమ్ చేంజర్ ను ఫినిష్ చేసి,భారతీయుడు త్రీ బ్యాలెన్స్ ఉన్న షూట్ ను కూడా కంప్లీట్ చేస్తాడనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో శంకర్ ఎలాంటి ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు అనేది…