https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: పెరిగిన విష్ణుప్రియ ఓటింగ్ గ్రాఫ్..డేంజర్ జోన్ లోకి వచ్చిన టాప్ కంటెస్టెంట్..ఈ వారం ఓటింగ్ లో అనూహ్యమైన మార్పులు!

తేజ కి ఇంత ఓటింగ్ వస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. అసలు ఆయన అంచనాలకు ఏమాత్రం ఆడకుండా టాస్కులు ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ ని పంచుతున్నాడు, అదే విధంగా నామినేషన్స్ లో కూడా రఫ్ఫాడించేస్తున్నాడు. ఇతను టాప్ 5 వరకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Written By: Vicky, Updated On : November 14, 2024 3:07 pm
Bigg Boss 8 Telugu(68)

Bigg Boss 8 Telugu(68)

Follow us on

Bigg Boss 8 Telugu: గత వారం గంగవ్వ, హరితేజ డబుల్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిపోగా, హౌస్ లో ఇప్పుడు 10 మంది మిగిలారు. వీరిలో ఈ వారం నామినేషన్స్ లోకి యష్మీ , విష్ణు ప్రియ, అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ మరియు గౌతమ్ నామినేషన్స్ లోకి వచ్చారు. గౌతమ్ టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్నాడు, అతను నామినేషన్స్ లో అందరి కంటే టాప్ లో ఉన్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. గ్రూప్ గేమ్స్ ఆడకుండా, తనకి నచ్చిన పద్దతిలో గేమ్స్ ఆడుకుంటూ, ఆయన ఇంత దూరం వచ్చాడు. మరోపక్క సోషల్ మీడియా లో K బ్యాచ్ పై విపరీతమైన నెగటివిటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో గౌతమ్ మన తెలుగు అబ్బాయి, ఎలా అయినా అతన్ని గెలిపించుకోవాలి అనే కసి అందరిలో బాగా పెరిగింది. అందుకే టైటిల్ రేస్ లోకి దూసుకొచ్చాడు. గౌతమ్ తర్వాత అత్యధిక ఓట్లతో టేస్టీ తేజ కొనసాగుతున్నాడు.

తేజ కి ఇంత ఓటింగ్ వస్తుందని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. అసలు ఆయన అంచనాలకు ఏమాత్రం ఆడకుండా టాస్కులు ఆడుతున్నాడు, ఎంటర్టైన్మెంట్ ని పంచుతున్నాడు, అదే విధంగా నామినేషన్స్ లో కూడా రఫ్ఫాడించేస్తున్నాడు. ఇతను టాప్ 5 వరకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక మూడవ స్థానం లో అవినాష్ కొనసాగుతున్నాడు. ఈయన హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నామినేషన్స్ లోకి రాలేదు, ఈ వారమే వచ్చాడు. గత సీజన్ లో సందీప్ మాస్టర్ కూడా ఇలాగే వరుసగా ఆరు వారాలు నామినేషన్స్ లోకి రాకుండా 7 వ వారం వచ్చాడు. ఫ్యాన్ బేస్ సరిగా ఏర్పడకపోవడం వల్ల నామినేషన్స్ లోకి వచ్చిన వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవినాష్ పరిస్థితి కూడా ఇంతే అనుకున్నారు, కానీ జనాలు ఆయన లేని బిగ్ బాస్ షో ని ఊహించుకోలేకపోయారేమో, అందుకే ఈ ఓట్లు బాగా పడ్డాయి. టాప్ 3 లో కొనసాగుతున్నాడు.

నాల్గవ స్థానం లో యష్మీ కొనసాగుతుంది. ఈమె ఎప్పుడైనా 5వ స్థానంలోకి పడిపోవచ్చు. ఎందుకంటే ఈ వారం పోలింగ్ ప్రారంభించిన వెంటనే గౌతమ్ తర్వాత రెండవ స్థానంలో నిల్చింది. ఆ తర్వాత మూడవ స్థానం కి పడిపోయింది, ఇప్పుడు నాల్గవ స్థానంకి వచ్చింది. విచిత్రం ఏమిటంటే డేంజర్ జోన్ లో ఉన్న విష్ణు ప్రియ ఓటింగ్ ఒక్కసారిగా పెరిగింది. పృథ్వీ ని దాటి ఒక అడుగు ముందు ఉన్న విష్ణు ప్రియ, అతి త్వరలోనే యష్మీ ని కూడా దాటే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఓటింగ్ తేడా పెద్దగా లేదు. చూస్తూ ఉంటే ఈ వీకెండ్ ఎలిమినేషన్ రౌండ్ లోకి యష్మీ, పృథ్వీ వచ్చేలా ఉన్నారు. నబీల్ ఏవిక్షన్ పాస్ ని వీళ్ళిద్దరిలో ఎవరికీ ఉపయోగిస్తాడో చూడాలి.