Tamil Movies: తెలుగు సినిమా ప్రేక్షకులు మొదటి నుంచి కూడా మన సినిమాలతో పాటు మంచి కంటెంట్ తో వచ్చే ఇతర భాషల సినిమాలను కూడా ఆదరిస్తూ ఉంటారు. కానీ పర భాష ప్రేక్షకులు మాత్రం ఇతర భాష ల నుంచి వచ్చే సినిమాలను యాక్సెప్ట్ చేయలేరు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం సినిమా బాగుంటే అది ఏ భాష సినిమా అయిన అందులో హీరో ఎవరైనా సరే ఆ సినిమాను చూసి సూపర్ సక్సెస్ చేస్తారు. ఇక అలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా నటులందరూ తెలుగులో సూపర్ స్టార్లు గా గుర్తింపు పొందుతున్నారు.
మన ప్రేక్షకులు వాళ్ళ సినిమాలను రిజెక్ట్ చేసినట్లయితే వాళ్లకు అసలు ఇక్కడ మార్కెట్ అనేది ఉండకపోయేది. వాళ్ళ సినిమాలను మన దగ్గర రిలీజ్ చేసి స్టార్ హీరోలుగా ఎదగడం తో పాటు చాలా మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం తమిళ్ సినిమాల హవా చాలా ఎక్కువగా కొనాసాగబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక తెలుగులో మన హీరోలా సినిమాలు వస్తున్నప్పటికీ మన సినిమాలతో పాటు అక్కడి స్టార్ హీరోల సినిమాలు కూడా రాబోతున్నాయి. దానివల్ల తెలుగు మార్కెట్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈనెల 12వ తేదీన ‘భారతీయుడు 2’ సినిమాతో కమల్ హాసన్ థియేటర్లోకి వస్తుంటే, ఆగస్టు 15వ తేదీన ‘తంగలన్’ సినిమాతో విక్రమ్ వస్తున్నాడు. ఇక ఈ సినిమాతో విక్రమ్ తెలుగులో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు.
ఇక వీళ్లిద్దరి తర్వాత దసరా కానుకగా సూర్య తన కంగువ సినిమాను తీసుకొచ్చి తెలుగులో ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్లతో పాటుగా ఈ ఇయర్ ఎండింగ్ కి రజనీకాంత్ కూడా ‘వెట్టయన్ ‘ అనే సినిమాతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు కనక మనం చూసుకున్నట్లయితే మన తెలుగు హీరోల సినిమాలతో పాటు పోటీగా తమిళ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. మరి వీటిలో మన సినిమాలను డామినేట్ చేస్తూ తమిళ్ సినిమాలు ఎంతవరకు సక్సెస్ సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది…