https://oktelugu.com/

Sai Pallavi: అతనితో పదేళ్లుగా రిలేషన్ షిప్ చేస్తున్నా.. సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీ షాక్..

Sai Pallavi: అందాల భామ సాయి పల్లవి ‘కస్తూరి మాన్’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. డెబ్యూ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ కావడంతో వెంటనే ఆమెకు తెలుగులో ‘ఫిదా’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ సైతం బంపర్ హిట్టు కొట్టడంతో ఆమెకు అవకాశాల వరద పారింది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 8, 2024 / 02:29 PM IST

    Sai Pallavi loves Abhimanyu

    Follow us on

    Sai Pallavi: సౌత్ సినీ బ్యూటీ సాయిపల్లవి గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. నేచురల్ యాక్టింగ్ తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కొంత కాలంగా సాయి పల్లవి సినిమాలు వరుసగా వచ్చాయి. కానీ ఇటీవల తక్కువయ్యాయి. అయితే ఈమె త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో భాగంగా రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఈ సందర్భంగా సాయి పల్లవి ‘మహాభారతం’ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.

    అందాల భామ సాయి పల్లవి ‘కస్తూరి మాన్’ అనే సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. డెబ్యూ మూవీతోనే సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ కావడంతో వెంటనే ఆమెకు తెలుగులో ‘ఫిదా’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీ సైతం బంపర్ హిట్టు కొట్టడంతో ఆమెకు అవకాశాల వరద పారింది. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాలు చేసింది. అయితే తెలుగులో విరాట పర్వం సినిమా తరువాత సాయి పల్లవి మరోసారి కనిపించలేదు. ఈ మూవీ రిలీజ్ అయి రెండేళ్లు అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ నాగచైతన్యతో కలిసి ‘తండేల్’ సినిమాలో నటిస్తోంది.

    సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఆమె ‘రామాయణం’ అనే ప్రాజెక్టు కోసం పనిచేస్తోంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మహాభారతం గురించి హాట్ కామెంట్స్ చేసింది. మహాభారతంలో అర్జునుడు అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. అంతేకాకుండా అర్జునుడు కుమారుడు అభిమన్యుడి క్యారెక్టర్ గురించి తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. గత పదేళ్లుగా అభిమన్యుడితో తాను రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తున్నానని అంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినీ జనాలు షాక్ అవుతున్నారు.

    అయితే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా వస్తున్న ఓ సినిమాలో సాయిపల్లవి నటిస్తోంది. దీనితో పాటు ‘రామాయణం’ అనే సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఇక సినిమాల విషయంలో సాయి పల్లవి చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. తనకు పాత్ర నచ్చితేనే సినిమాను ఒప్పుకుంటారని ఇండస్ట్రీలో ఆమె గురించి చెబుతూ ఉంటారు.