John Cena: అందరికీ షాక్ ఇచ్చిన జాన్ సీనా.. ఫ్యాన్స్ హర్ట్.. ఇలా చేస్తాడనుకోలేదు

John Cena: ‘ఈ రాత్రి, నేను డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి నా రిటైర్మెంట్ ను అధికారికంగా ప్రకటిస్తున్నాను’ అని సీనా తన కెరీర్ లో అత్యంత హృదయవిదారక ప్రోమోను రిలీజ్ చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ పాల్ ‘ట్రిపుల్ H’ హెడ్ లెవెస్క్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’

Written By: Neelambaram, Updated On : July 8, 2024 2:43 pm

John Cena officially announced his retirement

Follow us on

John Cena: యూఎస్ రెజ్లింగ్ సూపర్ స్టార్, నటుడు జాన్ సీనా 2025లో ఇన్-రింగ్ పోటీల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినట్లు వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) జూలై 7న సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ (ట్విటర్)లో పోస్టు పెట్టింది.

‘జాన్ సీనా ఇన్-రింగ్ పోటీ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. లాస్ వెగాస్ లో రెజిల్ మానియా-41 అతని చివరి’దని WWE తెలిపింది.

‘ఈ రాత్రి, నేను డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి నా రిటైర్మెంట్ ను అధికారికంగా ప్రకటిస్తున్నాను’ అని సీనా తన కెరీర్ లో అత్యంత హృదయవిదారక ప్రోమోను రిలీజ్ చేశారు. డబ్ల్యూడబ్ల్యూఈ క్రియేటివ్ పాల్ ‘ట్రిపుల్ H’ హెడ్ లెవెస్క్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే శీర్షికతో తాను, సీనా తెరవెనుక కౌగిలించుకున్న చిన్న వీడియో క్లిప్ ను ట్వీట్ చేశారు.

సీనా తన రెజ్లింగ్ కెరీర్ ను 2001లో ప్రారంభించాడు. జూన్, 2002 లో WWEలో అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే చరిత్రలో నిలిచిపోయేంత గొప్ప రెజ్లర్ గా మారాడు. 2018 నుంచి సీనా తన ప్రత్యర్థి డ్వేన్ ‘ది రాక్’ జాన్సన్ మాదిరిగానే తన సినీ కెరీప్ పై దృష్టి పెట్టేందుకు డబ్ల్యుడబ్ల్యుఈలో పార్ట్ టైం పాత్రను తీసుకున్నాడు. అయినప్పటికీ, అతను ఇటీవల రెజిల్ మానియా-40లో కనిపించడంతో సహా సంక్షిప్త పునరాగమనం చేశాడు. అక్కడ డబ్ల్యుడబ్ల్యుఈ ఛాంపియన్ షిప్ కోసం రోమన్ రైస్ ను ఓడించేందుకు కోడి రోడ్స్ కు సాయ పడ్డాడు.

సీనా రిటైర్మెంట్ ప్రకటన సోమవారం రాత్రి నెట్ ఫ్లిక్స్ లోని ‘రా (RAW)’లో వెలువడింది. అతని రిటైర్మెంట్ తో డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక శకం ముగిసింది. అభిమానులు రింగ్ లో అతని ఉనికిని కోల్పోతారు. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే తన చివరి మ్యాచ్ లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని సీనా హామీ ఇచ్చాడు.

సోమవారం నైట్ ‘రా’ నెట్ ఫ్లిక్స్ కు మారడం డబ్ల్యుడబ్ల్యుఈకు కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. ఇది షోకు కొత్త అవకాశాలను తీసుకువస్తుందని భావిస్తున్నారు. సీనా వారసత్వం భవిష్యత్తు రెజ్లర్లకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈకి అతను చేసిన సేవలను అభిమానులు గుర్తుంచుకుంటారు.