Tamanna
Tamanna: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. పాలరాతి శిల్పం లాంటి శరీరం, అందమైన ముఖం, వీటితో పాటు అద్భుతమైన నటన, మెరుపు తీగ లాగ నృత్యాలు, ఇవన్నీ తమన్నా కి మాత్రమే సొంతం. అయితే ఎంత అందం ఉన్నప్పటికీ తనకి తాను కొన్ని లిమిట్స్ ని పెట్టుకుంది తమన్నా. ముఖ్యంగా ఒక సినిమాకి ఆమె సంతకం పెట్టే ముందు ముద్దు సన్నివేశాలు ఉన్నాయో లేవో తెలుసుకొని మరీ సంతకం చేస్తుంది.
కథ కచ్చితంగా డిమాండ్ చేస్తే తప్ప ఆమె అలాంటి సన్నివేశాల్లో నటించేది కాదు. కెరీర్ ప్రారంభం లో పైకి రావాలి అంటే డైరెక్టర్స్ ఇలాంటివి అన్నీ చేస్తేనే సినిమా అవకాశాలు ఇస్తామని అంటారు.కానీ తమన్నా అలాంటి వాటికి లొంగకుండా , ఇన్నేళ్లు ఇతర హీరోయిన్స్ లాగ రెచ్చిపోయి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకుండా తాను నమ్ముకున్న విలువలను పాటిస్తూ వచ్చింది.
ఎందుకని మీరు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడరు అని కొంతమంది మీడియా మిత్రులు అడిగినప్పుడు, నా కుటుంబం నా సినిమా చూసేటప్పుడు సిగ్గుతో తల దించుకోకూడదు, అందుకే నేను అలాంటి సన్నివేశాలు చెయ్యను అని చెప్పుకొచ్చేది. కానీ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత తమన్నా పూర్తిగా మారిపోయింది. రీసెంట్ గా విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ చిత్రం లో ఆమె రెచ్చిపోయి మరీ నటించింది. అసలు కుటుంబం తో కలిసి ఆ సినిమా చూశారంటే తమన్నా ని పచ్చి బూతులు తిట్టేసారు.
ఏకాంతం గా మొగుడు పెళ్ళాం గదిలో ఉన్నప్పుడు ఎంత పచ్చిగా రొమాన్స్ చేసుకుంటారో, అంత పచ్చిగా రొమాన్స్ చేసింది తమన్నా.ఇక హీరో తో ఆమె చేసిన సంభాషణలు వింటే చెవులు మూసుకోవాల్సిందే. ఇవన్నీ ఆమె కుటుంబ సభ్యులు చూస్తే సిగ్గు తో తలదించుకోకుండా సంతోషిస్తారా?, మరి తమన్నా ఒకప్పుడు కుటుంబ సభ్యుల కోసం అలాంటి సన్నివేశాలు చెయ్యను అని చెప్పి ఇప్పుడు ఎలా చేసింది?, అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.