Adipurush Stars Remunerations: ఆదిపురుష్ స్టార్స్ రెమ్యూనరేషన్స్… ప్రభాస్ నుండి సైఫ్ వరకు ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?

ఈ మూవీలో కీలక రోల్స్ చేసిన నటులు ఎవరెవరు ఎంత తీసుకున్నారో పరిశీలిస్తే... లక్ష్మణుడు పాత్ర చేసిన సన్నీ సింగ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నారట. ఆయన కెరీర్లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటున్నారు. ఇక హీరోయిన్ కృతి సనన్ రూ. 3 కోట్లు తీసుకున్నారట. కృతి రెగ్యులర్ గా రూ. 2 కోట్లు తీసుకుంటారట. ఆదిపురుష్ మూవీకి ఆమె అంత మొత్తంలో ఛార్జ్ చేశారట.

Written By: Shiva, Updated On : June 15, 2023 8:43 am

Adipurush Stars Remunerations

Follow us on

Adipurush Stars Remunerations: ఆదిపురుష్ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో దిగనుంది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి రామాయణం చేస్తున్నారు. రామునిగా నటించారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. కృతి సనన్ జానకి పాత్ర చేశారు. ప్రభాస్ మినహాయిస్తే ఆదిపురుష్ మూవీలో కీలక పాత్రలు బాలీవుడ్ నటులు చేశారు. లంకేశ్వరుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇక లక్ష్మణుడు పాత్ర సన్నీ సింగ్ చేయడం జరిగింది. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీలో నటుల రెమ్యూనరేషన్స్ కోసం బాగా ఖర్చు చేశారునై తెలుస్తుంది.

ఈ మూవీలో కీలక రోల్స్ చేసిన నటులు ఎవరెవరు ఎంత తీసుకున్నారో పరిశీలిస్తే… లక్ష్మణుడు పాత్ర చేసిన సన్నీ సింగ్ రూ. 1.5 కోట్లు తీసుకున్నారట. ఆయన కెరీర్లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటున్నారు. ఇక హీరోయిన్ కృతి సనన్ రూ. 3 కోట్లు తీసుకున్నారట. కృతి రెగ్యులర్ గా రూ. 2 కోట్లు తీసుకుంటారట. ఆదిపురుష్ మూవీకి ఆమె అంత మొత్తంలో ఛార్జ్ చేశారట.

ఇక ప్రధాన విలన్ లంకేశ్వరుడు రోల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ భారీగానే తీసుకున్నారట. ఆదిపురుష్ చిత్రానికి సైఫ్ అలీ ఖాన్ రూ. 12 కోట్లు తీసుకున్నారని సమాచారం. సినిమాకు ప్రధాన ఆకర్షణ హీరో ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతంటే… బడ్జెట్ లో నాలుగో వంతు ఆయన తీసుకున్నారట. ఆదిపురుష్ చిత్రానికి ప్రభాస్ రూ. 100 నుండి 150 కోట్లు తీసుకున్నారట. కచ్చితంగా ఇంత తీసుకున్నారనే సమాచారం లేకపోయినప్పటికీ, ఆయన రెమ్యూనరేషన్ ఈ మధ్యలో ఉంటుందని అంటున్నారు.

జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. నేడు అర్ధరాత్రి నుండే ప్రీమియర్స్ ప్రదర్శన జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ భారీగా ఉన్నాయి. ఆదిపురుష్ టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టే ఆస్కారం ఉంది. బాహుబలి సిరీస్ అనంతరం ప్రభాస్ కి క్లీన్ హిట్ పడలేదు. సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. ఆదిపురుష్ మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన చూస్తున్నారు.