Bhola Shankar : ‘భోళా శంకర్’ మూవీలో చిరు ప్లేసులో ఆ స్టార్ హీరో ఉండాల్సింది.. అసలేం జరిగిందంటే? 

ఏఎం రత్నం పవన్ ను కలిసి ‘భోళా శంకర్’ సినిమా చేయాలని అడిగారట. కానీ ఈ సినిమా తనకు షూట్ కాదని చెప్పారట. అయితే ఆ తరువాత ఈ సినిమా హక్కులను అనిల్ సుంకర చేజిక్కంచుకోవడంతో మెగా హీరో మాత్రమే చేయాలనే ఉద్దేశంతో చిరంజీవిని అడగడంతో ఓకే చెప్పారట.

Written By: Chai Muchhata, Updated On : July 23, 2023 5:41 pm
Follow us on

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లో బిజీగా మారాడు. వరుస బెట్టి సినిమాలు తీస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన తీసిన ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ కావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆ తరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ‘భోళా శంకర్’లో నటించారు. తమిళంలో సక్సెస్ అయిన ‘వేదాళం’ మూవీకి రీమేక్ అయినా చిరు తన నటనతో ఆకట్టుకున్నట్లు ఇప్పటి వరకు రిలీజైన టీజర్ల ఆధారంగా చెప్పొచ్చు. అయితే భోళా శంకర్ సినిమాను ముందుగా ఓ స్టార్ హీరోను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను చిరు చేయాల్సి వచ్చిందట. మరి దానికి సంబందించిన డిటేయిల్స్ లోకి వెళితే..
మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న ‘భోళా శంకర్’ మూవీకి సంబంధించి ఇటీవల ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ  సందర్భంగా చిరంజీవి పవన్ కల్యాన్ ను ఇమిటేట్ చేస్తూ కనిపించారు. వాస్తవానికి ఇన్నాళ్లు చిరును ఇమిటేట్ చేసి అందరూ మెగా హీరో అనిపించుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవి ఏకంగా పవన్ కల్యాన్  యాక్టింగ్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ తరుణంలో ఓ ఆసక్తి విషయం వెలుగులోకి వస్తుంది. ఈ సినిమాను ముందుగా పవన్  నే అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల చిరు కు వచ్చిందట.
తమిళంలో ‘వేదాళం’ మూవీని ఏఎం రత్నం నిర్మించారు. ఈయన తెలుగులో పవన్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి క్రిష్ డైరెక్టర్. కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదాపడుతూ వస్తోంది. ఇదే సమయంలో ఏఎం రత్నం పవన్ ను కలిసి ‘భోళా శంకర్’ సినిమా చేయాలని అడిగారట. కానీ ఈ సినిమా తనకు షూట్ కాదని చెప్పారట. అయితే ఆ తరువాత ఈ సినిమా హక్కులను అనిల్ సుంకర చేజిక్కంచుకోవడంతో మెగా హీరో మాత్రమే చేయాలనే ఉద్దేశంతో చిరంజీవిని అడగడంతో ఓకే చెప్పారట. అలా మెగాస్టార్ కు ఈ మూవీ వెళ్లింది.
‘భోళా శంకర్’ సిస్టర్ సెంటిమెంట్ మూవీ. తమిళంలో బిగ్గెస్ట్ హిట్టు కొట్టింది. అయితే చాలా తమిళ సినిమాలు అక్కడ్ బ్లాక్ బస్టర్ అయినా.. వాటిని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. మరోవైపు వరుస ప్లాపుల డైరెక్టర్ గా పేరు తెచ్చుుకున్న మెహర్ రమేష్ ఈ సినిమాను టేకాఫ్ చేయడంపై కాస్త నిరాశ నెలకొంది. అయితే సినిమా లుక్స్, గ్లింప్స్ చూస్తే అదిరిపోతున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. ఆగస్టులో ఈ మూవీని థియేటర్లోకి తీసుకురానున్నారు.