https://oktelugu.com/

Tea : ఈ 4 విషయాలు టీ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి.. రుచే మారిపోతుంది..

తరువాత డీకాషన్ తయారవుతుంది. అనంతరం మూడు చిన్న గ్లాసుల పాలు పోయాలి. కలుపుతూ ఉంటే టీ పొంగు వస్తుంది. దీంతో టీ తయారైనట్లు భావించాలి. ఇలా చేసిన టీ తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 23, 2023 / 05:48 PM IST
    Follow us on

    Tea : మనలో చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఆంగ్లేయులు చేసిన అలవాటు అంత తేలిగ్గా పోతుందా. ఇంకా ఎక్కువే అవుతుంది. పొద్దున్నే టీ తాగనిదే ఏ పనిచేయని వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా టీ మన జీవితంతో ముడిపడిపోయింది. చలికాలంలో అయితే ఉదయం లేవగానే టీ తాగనిదే ఏ పని చేయరు. అలా టీకి మనం ఆకర్షితులం అయ్యాం. టీలో చాలా రకాలుంటాయి. అల్లంతో చేసే టీ, మసాలా టీ, యాలకులు వేసే టీ ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చేసుకుంటుంటారు.

    టీ వల్ల లాభముందా?

    టీ తాగడం వల్ల ఒక శాతం కూడా లాభం లేదు. ఏదో తృప్తికి తాగడమే తప్ప టీ తాగడం వల్ల బలం రాదు. అందరు ఎందుకు తాగుతున్నారంటే ఒకరిని చూసి మరొకరు. మనకు బయట చేసే టీ భలే వాసన వస్తుంది. కానీ ఇంట్లో అంత టేస్టీ రాదని అందరు అనుకుంటుంటారు. కానీ బయట చేసే టీ మాదిరి ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ దానినికి అన్నింటిని వేసుకుంటే ఆ రుచి వస్తుంది.

    ఎలా తయారు చేసుకోవాలి?

    మసాలా టీ ఎలా తయారు చేసుకోవాలంటే రెండు ఇంచుల అల్లం నూరి పక్కన పెట్టుకోవాలి. మూడు యాలకులను దంచి పక్కన పెట్టాలి. మూడు లవంగాలను కూడా అలాగే చేయాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో మూడు చిన్న గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు మీడియం మంటపై మరిగించాలి. నీరు మరిగాక అల్లం, యాలకులు, లవంగాల పొడి వేసి బాగా మరిగించాలి. నీరు కాస్త కలర్ వచ్చాక అందులో మూడు టీ స్పూన్ల టీపొడి వేయాలి. తరువాత మూడు టీ స్పూన్ల చక్కెర కూడా కలపాలి.

    డికాషన్

    తరువాత డీకాషన్ తయారవుతుంది. అనంతరం మూడు చిన్న గ్లాసుల పాలు పోయాలి. కలుపుతూ ఉంటే టీ పొంగు వస్తుంది. దీంతో టీ తయారైనట్లు భావించాలి. ఇలా చేసిన టీ తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. బయట తాగినట్లే ఉంటుంది. టీ తయారు చేసుకోవడంలో అన్ని పదార్థాలు సమంగా వేస్తే రుచి బాగుంటుంది. అచ్చం బయట తాగినట్లే ఉంటుంది.