Devara Movie : దేవర’ చిత్రంలో పెద్ద ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటించింది ఎవరో తెలుసా..? ట్రైలర్ లో మీరు గమనించని విషయం ఇదే!

అసలు 'దేవర' క్యారక్టర్ కి హీరోయిన్ ఉంటుందా, లేదా?.. ట్రైలర్ లో అయితే 'దేవర' క్యారక్టర్ కి హీరోయిన్ ఉన్నట్టు చూపించలేదు. కానీ 'దేవర' పాత్రకు కూడా హీరోయిన్ ఉంది అనేది విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరాఠీ భాషకు చెందిన శృతి మారాతే ఈ సినిమాలో 'దేవర' పాత్రకు హీరోయిన్ గా నటిస్తుంది.

Written By: Vicky, Updated On : September 10, 2024 8:39 pm

Shruti Marathe

Follow us on

Devara Movie :  కోట్లాది మంది నందమూరి అభిమానులతో పాటుగా టాలీవుడ్ మూవీ లవర్స్ కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం ‘దేవర’. #RRR వంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ట్రేడ్ లో అంచనాలు ప్రారంభ స్థాయి నుండే విపరీతంగా ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరిగింది. మరి ఆ బిజినెస్ తగ్గట్టు వసూళ్లను రాబడుతుందా లేదా అనేది ఈ నెల 27 వ తారీఖున తెలుస్తుంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉన్నాయి. #RRR చిత్రానికి కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. అయితే ఈరోజు ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. రెస్పాన్స్ చాలా డివైడ్ గా ఉండడం తో ఇదే ఫ్లో లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయా లేదా అనేది చూడాలి.

ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత అభిమానులతో పాటు, ప్రేక్షకులకు కూడా కలిగిన ప్రశ్న పెద్ద ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఎవరు నటించారు?, అసలు ‘దేవర’ క్యారక్టర్ కి హీరోయిన్ ఉంటుందా, లేదా?.. ట్రైలర్ లో అయితే ‘దేవర’ క్యారక్టర్ కి హీరోయిన్ ఉన్నట్టు చూపించలేదు. కానీ ‘దేవర’ పాత్రకు కూడా హీరోయిన్ ఉంది అనేది విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. మరాఠీ భాషకు చెందిన శృతి మారాతే ఈ సినిమాలో ‘దేవర’ పాత్రకు హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె క్యారక్టర్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని సమాచారం. ఈ సినిమాలో ‘దేవర’ పాత్ర చనిపోయినట్టుగానే ఇంటర్వెల్ వరకు చూపిస్తారట. కానీ ఆ తర్వాత ఆ పాత్ర ఇంకా బ్రతికే ఉందా?, లేదా చనిపోయిందా అనే సస్పెన్స్ తో ఆడియన్స్ చివరి వరకు చూసేలా స్క్రీన్ ప్లే ని తీర్చి దిద్దాడట కొరటాల శివ.

చివరి 40 నిమిషాలు కొరటాల శివ తన విశ్వరూపం చూపించేసాడని, నాకు తెగ నచ్చేసింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ నేడు ముంబై లో జరిగిన ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. అనిరుద్ తన కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే విధంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడట. ఇప్పటికే ఆయన అందించిన మూడు పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. త్వరలోనే ‘ఆయుధ పూజ’ సాంగ్ ని విడుదల చేస్తారట. సినిమా విడుదలకు వారం రోజుల ముందు ఈ పాట ని ఆన్లైన్ లో వదులుతామని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ పాట లీక్ అయ్యింది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ పాటని ఎన్టీఆర్ మీద చిత్రీకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యే ముందే ఈ పాటని వదలబోతున్నారని టాక్, చూడాలి మరి ఏ రేంజ్ లో ఈ పాట అడ్వాన్స్ బుకింగ్స్ కి బూస్ట్ ఇవ్వబోతుందో.