https://oktelugu.com/

DEVARA Trailer Talk : ఆచార్య’ ని చూసిన కూడా ఎన్టీఆర్ కొరటాల కి అవకాశం ఇచ్చి పొరపాటు చేశాడా? ‘దేవర’ ట్రోల్స్ మామూలుగా లేవుగా!

ఇచ్చిన అవకాశం ని కొరటాల శివ నిలబెట్టుకున్నాడా లేదా అనేది ఈ నెల 27 వ తారీఖున తెలిసిపోతుంది. ట్రైలర్ చూస్తే రొటీన్ సబ్జెక్టు లాగానే అందరికీ అనిపించింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు కథలో కొత్తదనం ఏ కోశానా కనిపించలేదు ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ లో. నీరసంగా స్క్రీన్ ప్లే తో అలా సాగిపోయింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 10, 2024 / 08:50 PM IST

    koratala siva

    Follow us on

    DEVARA Trailer Talk : సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా తమ సినిమాలను సూపర్ హిట్స్ కొట్టి మంచి ఫామ్ మీద ఉన్న డైరెక్టర్ తోనే చెయ్యాలని అనుకుంటాడు. ఎందుకంటే తమ సినిమాల కోసం ఎదురు చూసే కోట్లాది మంది అభిమానులు నిరాశ చెందకూడదు అని ప్రతీ ఒకరికి ఉంటుంది కదా. కానీ ఎన్టీఆర్ మాత్రం కొరటాల శివ ని నమ్మాడు. ‘ఆచార్య’ లాంటి సినిమా చూసి ఎన్టీఆర్ కొరటాల కి అవకాశం ఇచ్చాడంటే అతని గుండె ధైర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. #RRR లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత అభిమానులు వెంటనే ప్రశాంత్ నీల్ తో సినిమాని ఎన్టీఆర్ ప్రారంభిస్తాడని అనుకున్నారు. కానీ ఆయన తన మిత్రుడు కొరటాల శివకే అవకాశం ఇచ్చాడు.

    ఇచ్చిన అవకాశం ని కొరటాల శివ నిలబెట్టుకున్నాడా లేదా అనేది ఈ నెల 27 వ తారీఖున తెలిసిపోతుంది. ట్రైలర్ చూస్తే రొటీన్ సబ్జెక్టు లాగానే అందరికీ అనిపించింది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు కథలో కొత్తదనం ఏ కోశానా కనిపించలేదు ఈరోజు విడుదల చేసిన ట్రైలర్ లో. నీరసంగా స్క్రీన్ ప్లే తో అలా సాగిపోయింది. ఇదే తరహా లో సినిమా కూడా ఉంటే కచ్చితంగా మరో ఆచార్య అవ్వడం పక్కా అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన దేవర ట్రైలర్ మీద ట్రోల్ల్స్ కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మాస్ హీరో కాబట్టి, ఆయనకీ అభిమానులు ఎంత మంది ఉంటారో, ద్వేషించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు. కానీ దేవర చిత్రానికి అభిమానులే కొంతమంది కొరటాల శివ ని తిడుతున్నారు. అసలు షార్క్ తో అలాంటి షాట్స్ ఎలా పెట్టావు, మామూలుగా సినిమా తీసి ఉండొచ్చు కదా, నీ బుర్ర ఉండేది అంతంత మాత్రమే అని కొరటాల శివ ని తిడుతున్నారు ఫ్యాన్స్. ఆలోచిస్తే అది నిజమే అని అనిపిస్తుంది. ఒక హీరో కి ఎలాంటి షాట్స్ పెడితే సూట్ అవ్వదో, అలాంటి షాట్స్ పెట్టడం కొరటాల శివ కి అలవాటు.

    దేవర చిత్రం ట్రైలర్ చూసినప్పుడు అదే అనిపించింది. అసలే రొటీన్ సినిమాలాగా అనిపిస్తుంటే, దానికి తోడు కామెడీ షాట్స్ పెట్టి ట్రోల్ స్టఫ్ ఇచ్చాడని అభిమానులు తిడుతున్నారు. కొరటాల శివ చాలా కసి మీద ఈ చిత్రాన్ని తీసాను అన్నాడు, ఇదేనా ఆయన కసి?, ఆయనలో సత్తా మొత్తం అయిపోయిందా అని విమర్శలు వినిపిస్తున్నాయి. తన కోసం పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టి వెయిట్ చేస్తుంటే, ఇచ్చిన మాటకు కట్టుబడి, మూడేళ్ళ సమయం ఇచ్చి సినిమా తీసే అవకాశం కల్పించాడు ఎన్టీఆర్. రేపు ఏదైనా తేడా జరిగితే అభిమానుల చేతిలో కొరటాల శివ పరిస్థితి ఊహిస్తేనే భయంకరంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈరోజు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ దేవర ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.