Kriti Sanon : కృతి సనన్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ముందుగా టాలీవుడ్ లో రచ్చ చేసినా పెద్దగా ఆదరణ మాత్రం దక్కలేదు. Photo Credit Instagram
కానీ బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకుంది. ఏకంగా టాప్ కథానాయికగా సత్తా చాటింది అమ్మడు. Photo Credit Instagram
గత సంవత్సరం ప్రభాస్ సరసన ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయింది. Photo Credit Instagram
కృతి సనన్.. మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'నేనొక్కడినే'సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.Photo Credit Instagram
కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. 2021 ఏడాదికి గాను జాతీయ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.Photo Credit Instagram
మహేష్ బాబుతో నటించిన సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ సినిమాలో మాత్రం పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికిందనే చెప్పవచ్చు.Photo Credit Instagram
ఈ సినిమా తర్వాత హీరోపంతి సినిమాతో కృతి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా హిట్ తో ఇక మళ్లీ తెలుగులో దోచేయ్ సినిమాలో నాగ చైతన్యతో జతకట్టింది.Photo Credit Instagram
కానీ ఈ మూవీ ఇక్కడ వర్కౌట్ కాలేదు. హిందీలో చేసిన రెండో సినిమా దిల్ వాలే బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఇక అమ్మడుకు తిరుగు లేకుండా పోయింది. Photo Credit Instagram