Homeఎంటర్టైన్మెంట్Mahesh babu: మహేశ్​కు జోడీగా లక్కీ హీరోయిన్​.. మాస్టర్​ ప్లాన్​తో వస్తోన్న జక్కన్న!​

Mahesh babu: మహేశ్​కు జోడీగా లక్కీ హీరోయిన్​.. మాస్టర్​ ప్లాన్​తో వస్తోన్న జక్కన్న!​

Mahesh babu: మహేశ్​బాబు నుంచి సినిమావస్తోందంటే చాలు వారి ఫ్యాన్స్​కు అదో పండగ. ఇక జక్కన్న రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడంటే.. అది ఏదో వండర్స్​నే క్రియేట్​ చేస్తుందని అనుకుంటారు. అదే వీరిద్దరూ కలిసి ఓ సినిమా తీస్తే.. అవును మీరు విన్నది నిజమే.. దర్శకుడు రాజమౌళి- సూపర్​స్టార్​ మహేశ్ కాంబినేషన్​లో ఓ క్రేజీ సినిమా పట్టాలెక్కనుంది. ఇటీవలే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.

Samantha

ఈ సినిమాకు ఇప్పటి వరకు తెలుగులో ఎప్పుడూ తీయని కొత్త కథతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా, ఆర్​ఆర్​ఆర్​ సినిమాతో ప్రస్తుతం ఫుల్​ బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ సినిమా పూర్తికాగానే.. మహేశ్​ సినిమాపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్​కు సంబంధించి ఓ క్లారిటీ రానున్నట్లు టాక్​.

కాగా, ఇప్పటి వరకు టైటిల్​ కూడా ప్రకటించని ఈ సినిమాకు సబంధించి రోజుకో కొత్త వార్త నెట్టింట వైరల్​ అవుతోంది. తాజాగా సమాచారం ప్రకారం.. మహేశ్​- రాజమౌళి కాంబోలో రానున్న ఈ సినిమాలో సమంతను హరోయిన్​గా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సమంతతో కలిసి మహేశ్​ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.  వీరి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలోనే మరోసారి వీరిని కలిపి హిట్​ కొట్టేందుకు జక్కన్న సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకు వేచి చూడాల్సిందే.

ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నసంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular