T20 World Cup: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా ఉంది టీమిండియా పరిస్థితి. టీ 20 ప్రపంచ కప్ లో అదరగొడుతుందనుకున్న జట్టు అపజయాల మూట కట్టుకుని స్వదేశానికి వచ్చింది. మూడు విజయాలు రెండు పరాజయాలతో టోర్నీ నుంచి లీగ్ దశలోని నిష్ర్కమించింది. దీంతో టీమిండియా నిర్వాకంతో స్టార్ ఇండియాకు చావు తప్పి కన్ను లొట్టబోయింది. అభిమానులను నిరాశ పరచడమే కాకుండా ప్రత్యక్ష ప్రసారం చేసే చానళ్లకు సైతం చేదునే మిగిల్చింది. దీంతో భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి.

టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలో దిగింది. కానీ విజయాల నమోదులో బొక్కబోర్లా పడింది. సూపర్ 12 స్టేజిలోనే టోర్నీ నుంచి వైదొలిగింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని నిరాశ పరచింది. దీంతో కోహ్లి సేనపై బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. వ్యక్తిగత విమర్శలకు దిగి అభిమానులు తమ కోపాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో టీమిండియా తప్పిదం వల్ల బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా నెట్ వర్క్ కు ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో భారీగా కోత పడింది.
మ్యాచ్ లు జరిగే సమయంలో ప్రకటనల ప్రసారం కోసం స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ రూ.900 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు రాబట్టుకోవాలని అంచనా వేసింది. స్టార్ నెట్ వర్క్ సైతం రూ.250 కోట్లు సంపాదించాలని భావించింది. కానీ అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి కావడంతో నెట్ వర్క్ డబ్బు నష్టపోయినట్లు తెలుస్తోంది.
టీమిండియా టోర్నీ నుంచి నిష్ర్కమించడంతో స్టార్ ఇండియా 20% కోల్పోయింది. ఒక వేళ భారత్ చివరి మ్యాచ్ వరకు పోటీలో ఉంటే ప్రకటనల రూపంలో భారీ ఆదాయం సమకూరేది. పది సెకన్ల యాడ్ కోసం రూ.25 లక్షలు వసూలు చేస్తారు. ఈ లెక్కన నెట్ వర్క్ లు ఎంత మేర నష్టపోయాయో తెలిస్తే షాకే. టీమిండియా నిష్ర్కమణంతో స్టార్ ఇండియాకు సుమారు రూ.200 కోట్ల నష్టం జరిగినట్లు నిపుణుల అంచనా.
T20 World Cup Winner: వరుసగా 10 మ్యాచ్ లు ఓడి.. ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎలా సాధించింది?