Allu Arjun Remuneration : పుష్ప 2′ కి 3 ఏళ్ళు పని చేసినందుకు అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ అంతనా? ఆ డబ్బుతో ‘పుష్ప 3’ కూడా తియ్యొచ్చు!

ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే దిశగా ప్లానింగ్స్ చేస్తున్నారు మేకర్స్. ఇక సరైన టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు. ఈ చిత్రం కోసం సందీప్ వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ లాంటి టాప్ డైరెక్టర్స్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు అల్లు అర్జున్.

Written By: Vicky, Updated On : October 25, 2024 7:23 pm

Allu Arjun Remuneration

Follow us on

Allu Arjun Remuneration : ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ లో ఏర్పాటు చేస్తున్న బెంచ్ మార్క్స్ ని అందుకోవాలంటే భవిష్యత్తులో మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి మాత్రమే సాధ్యం అని చెప్పొచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమాలు అన్ని భాషల్లో బాగా ఆడితే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకుంటున్నాయి. కానీ ‘పుష్ప 2’ కేవలం ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్ల రూపాయిలను దాటేసింది. అంటే ఈ సినిమా స్టామినా బాక్స్ ఆఫీస్ వద్ద 2000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

అన్ని భాషల్లోనూ ఈ చిత్రాన్ని 90 శాతం థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారంటే ఈ సినిమా ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు. మొదటి రోజు వసూళ్లు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తాడని అంచనా వేస్తున్నారు. అలాగే నాలుగు రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే దిశగా ప్లానింగ్స్ చేస్తున్నారు మేకర్స్. ఇక సరైన టాక్ వస్తే ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు ఉంటాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా మూడేళ్ళ విలువైన సమయాన్ని కేటాయించాడు. ఈ చిత్రం కోసం సందీప్ వంగ, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ లాంటి టాప్ డైరెక్టర్స్ ని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు అల్లు అర్జున్.

అందుకే ఈ సినిమా కోసం ఆయన 200 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇండియా లో ఇప్పటి వరకు ఏ సూపర్ స్టార్ కూడా తీసుకోలేదు. మన టాలీవుడ్ లో రామ్ చరణ్, ప్రభాస్ మాత్రమే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ‘ఓజీ’ సినిమాకి 100 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకొని ఈ లిస్ట్ లోకి చేరాడు. కానీ అల్లు అర్జున్ వీళ్లందరికంటే రెండు రెట్లు ఎక్కువ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ప్రతీ సినిమాకి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకోవడం కుదరదు. పుష్ప 2 చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగింది కాబట్టి అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. కానీ అన్ని సినిమాలకు ఈ రేంజ్ బిజినెస్ జరగదు. అల్లు అర్జున్ రాబోయే సినిమాల్లో ఈ రేంజ్ బిజినెస్ జరగాలంటే ‘పుష్ప 3’ కి మాత్రమే సాధ్యం. ఇది ఇలా ఉండగా వచ్చే నెలలో ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతున్నారు మేకర్స్.