Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా అఖండ. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సోషల్‌మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. విదేశాల్లోనే బాలయ్య మ్యానియా ఎక్కడా తగ్గట్లేదు. ఈ సినిమాలో ప్రతి ఎలివేషన్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమనే చెప్పాలి. గతంలో వీరిద్దరి కలయికలో సింహా, లెజెండ్ సూపర్ హిట్ అందుకున్నాయి. మరోవైపు థమన్ మ్యూజిక్ సినిమాలో పూనకాలు తెప్పించాయట.
అయితే, తాజాగా బాలయ్య అభిమానులు సినిమా థియేటర్లో చేసిన రచ్చకు పోలీసులు షాక్ ఇచ్చారు. అయితే, అది కూడా ఆస్ట్రేలియాలో కావడం విశేషం. ఆస్ట్రేలీయాలోని ఓ థియేటర్లో బాలయ్య అభిమానులు చేసిన రచ్చకు థియేటర్ ఓనర్ మూవీ ఆపేసి మరీ మైకులో వార్నింగ్ ఇచ్చారట. అయినా బాలయ్య అభిమానులు అసలు తగ్గకపోవడం వల్ల.. పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
Also Read: డల్లాస్‌లో అఖండ విజయోత్సవం.. నెట్టింట్లో వీడియో వైరల్
మరోవైపు అమెరికాలోనూ బాలయ్య ఫ్యాన్స్ ను ఉద్దేశించి సినిమార్క్ థియేటర్లో అలర్ట్ నోట్ పెట్టారు. థియేటర్ సౌండ్‌ను నిర్దిష్ట పరిథిలో పెట్టడం జరిగిందని.. ఏదేమైనప్పటికి సౌండ్ పెంచడం కుదరదని అభిమానులకు సూచిస్తూ చెప్పారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. యూఎస్‌లో ఓ తెలుగు సినిమాకు ఇలా నోట్ అంటించడం ఇదే తొలిసారి.మరి బాలయ్య అంటే ఆమాత్రం ఉండాలి.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు.
Also Read: బాలయ్య అఖండ హిట్ టాక్ అందుకోవాలంటే రాబట్టాల్సిన కలెక్షన్ ఎంతో తెలుసా?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: In australia police warns to balayya fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com