Balayya : ‘అఖండ'(Akhanda Movie) చిత్రం నుండి బాలయ్య బాబు(Nandamuri Balakrishna) సెకండ్ ఇన్నింగ్స్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాకి ముందు బాలయ్య కి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్, ఇక కెరీర్ అయిపోయింది, తొందరగా మోక్షజ్ఞ ని దింపితే బాగుండును అని అనుకున్నారు. ఇంతలోపే ఆయన ‘అఖండ’ తో భారీ కం బ్యాక్ ఇవ్వడం, ఇక ఆ తర్వాత వరుసగా మూడు హిట్లు కొట్టడం సెన్సేషనల్ గా మారింది. బాలయ్య కెరీర్ కి సంగీత దర్శకుడు తమన్(SS Thaman) కూడా బాగా ప్లస్ అయ్యాడు. ఆయన సినిమాలు ఆ రేంజ్ లో ఎలివేట్ కావడానికి తమన్ అందించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉపయోగపడ్డాయి. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్ కి తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడై థియేటర్ లో ఉన్న ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసాయి.
తన సెకండ్ ఇన్నింగ్స్ కి ఎంతో సహాయపడ్డ తమన్ అంటే బాలయ్య కి ఎంతో ప్రేమ. అందుకే ఆయన నేడు ప్రేమతో పోర్చ్ కారుని బహుమతి గా అందించాడు. ఈ కారు విలువ సుమారుగా రెండు కోట్ల రూపాయిలు ఉంటుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ అఖండ 2 మూవీ షూటింగ్ జరిగే ముందు తమన్ వద్దకు వెళ్లి ఈ బహుమతి అందించాడు. బాలయ్య బాబు తో తమన్ ఇప్పటి వరకు 5 సినిమాలు చేసాడు. అందులో నాలుగు సూపర్ హిట్ అయ్యాయి, ఒకటి యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు ఆరవ సినిమాగా ‘అఖండ 2′(Akhanda 2 Movie) చేస్తున్నాడు. ఈ చిత్రం పై అభిమానుల్లోనే కాకుండా, ట్రేడ్ లో కూడా ఏ రేంజ్ బజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న స్క్రిప్ట్ ఇది. తమన్ మరోసారి బాలయ్య కోసం తన విశ్వరూపం చూపించబోతున్నాడు.
ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ వీడియో కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఊఫర్ బాక్సులు బద్దలైపోయే రేంజ్ లో ఉంది. ఇక సినిమాకి ఏ రేంజ్ లో ప్రాణం పెట్టి పని చేస్తాడో. గత కొద్దిరోజుల నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఎట్టి పరిస్థితిలోను సాధ్యమైనంత తొందరగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా, హిందీ, తమిళం , మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇందులో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అఖండ కి మించిన భారీ యాక్షన్ సన్నివేశాలు, సెంటిమెంటల్ సన్నివేశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయట.