Government Help: ‘వడ్డించే వాడు మనోడైతే ఆఖరి బంతిలో కూర్చున్న కీమా కీరకు ఢోకా లేదన్నట్లు’గా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. తమకు నచ్చితే ఒకలా.. నచ్చకుంటే మరోలా అన్నట్లుగా ప్రభుత్వాలు పనులు చేస్తుండటంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరికీ సాయం అందించే విషయంలోనూ ప్రభుత్వాలు సామాన్యులను ఒకలా.. సెలబ్రెటీల్లోని ఓ వర్గాన్ని మరోలా చూస్తుండటం శోచనీయంగా మారింది.

తాజాగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇద్దరు సెలబ్రెటీలు కన్ను మూశారు. వారిలో ఒకరు సిరివెన్నల సీతారామశాస్త్రి కాగా మరొకరు శివశంకర్ మాస్టర్. వీరిద్దరు ఒక్కరోజు తేడాతో కన్నుమూయడంతో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. సిరివెన్నల సీతారామశాస్త్రీ తన సాహిత్యంతో పాటలకు ప్రాణం పోసేవారు. అదేవిధంగా శివశంకర్ మాస్టర్ తన నృత్యంతో కళకు జీవం పోసేవారు. వీరిద్దరు కూడా ఆయా రంగాల్లో హేమాహేమీలే.
ప్రభుత్వాలు మాత్రం ఈ ఇద్దరు విషయంలో విభిన్నంగా స్పందించడమే తాజా చర్చకు దారితీసింది. సిరివెన్నల సీతారామాశాస్త్రి ఆస్పత్రి బిల్లును కుటుంబ సభ్యులు చెల్లించగా వాటిని వెనక్కి తీసుకోవాలని ఏపీ సర్కారు కోరినట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్నట్లుగా ప్రభుత్వం తరుఫున బిల్లులు కడుతామని ముందుకొచ్చింది. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏపీలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనిని ఎవరూ కూడా తప్పుపట్టడం లేదు.
అయితే శివశంకర్ మాస్టర్ విషయంలో మాత్రం ప్రభుత్వాలు ఇలా వ్యవహరించలేదు. నిజానికి శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉంది. ఆయన ఆస్పత్రి బిల్లుల కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అయినప్పటికీ వారంతా ఆయన్ని దక్కించుకోలేకపోయారు. అంతకముందు కత్తి మహేష్ విషయంలో మాత్రం ఏపీ సర్కారు చాలా స్పీడుగా స్పందించి సాయం అందించింది. ఈ విషయాన్నే అందరూ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం గతంలో ఇలానే వ్యవహరించారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి 50మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం నాడు తుతుమంత్రంగా చర్యలు తీసుకుంది. వారికి నేటికి ప్రభుత్వం సాయం అందలేదు. అయితే గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందినపుడు ప్రభుత్వం మరోలా స్పందించింది.
రూ.5కోట్ల రూపాయాలు, అతడికి భార్య గ్రూప్ 1 ఉద్యోగం, తదితర సదుపాయాలను కల్పించింది. అలాగే క్రీడాకారులు సానియామిర్జా, పీవీ సింధులకు ప్రభుత్వ ప్రోత్సాహకంగాగా వారు అడగకపోయినా కోట్లకు కోట్లకు కుమ్మరించింది. వీటిని ఎవరూ తప్పుబట్టకపోయినా సామాన్యుల విషయంలో ప్రభుత్వం ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read: కాంగ్రెస్, బీజేపీ ఎత్తులకు కేసీఆర్ పైఎత్తులు.. డైలామాలో జాతీయ పార్టీలు
మరోవైపు లక్షల్లో బాధితులు సీఎంఆర్ఎఫ్ కింద ఆస్పత్రి బిల్లు పొందాలంటే యేళ్ల తరబడి కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగుతున్నారు. వీరి గోడును ఎవరూ పట్టించుకోరనే అభిప్రాయం నెలకొంది. సామాన్యుడైనా, సెలబెట్రీలైనా అందరు మనుషులేనని ప్రభుత్వాలు గుర్తించి మానవత్వంతో సాయం అందించాలని పలువురు కోరుతున్నారు.
అధికారంలో ఉన్న నాయకులు కొందరికీ సాయం అందించి పబ్లిటీసీ చేసుకొని, మరికొందరి పట్ల వివక్ష చూపితే మాత్రం ప్రజల్లో పెద్దఎత్తున వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇకనైనా ప్రభుత్వాలు తమ తీరును మార్చుకొని కష్టాల్లో ఉన్నవారికి సాయం అందిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!
Also Read: ఏపీలో కమ్మ సామాజిక వర్గం ఒకటవుతుందా?