https://oktelugu.com/

Game Changer Movie : పవన్ కళ్యాణ్ పాటకు రామ్ చరణ్ స్టెప్పులు..’గేమ్ చేంజర్’ నుండి ఫ్యూజులు ఎగిరే అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్!

ఈ నెల 20 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సాంగ్ కోసం సుమారుగా 20 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. ఇదంతా పక్కన పెడితే 'గేమ్ చేంజర్' చిత్రంలో ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని దాచిపెట్టాడట డైరెక్టర్ శంకర్.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 06:50 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer Movie :  #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో కలిసి చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ అంచనాలు మొన్న విడుదలైన టీజర్ తో పది రెట్లు పెరిగింది. ఇండియన్ 2 ని చూసి శంకర్ పని ఇక అయిపోయింది అని అనుకున్నవాళ్ళందరూ ఈ టీజర్ ని చూసి ముక్కు మీద వేలేసుకున్నారు. శంకర్ నుండి విడుదలైన చివరి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘శివాజీ’. ఈ సినిమా తర్వాత ఆయన నుండి భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే వచ్చాయి కానీ, అలాంటి కమర్షియల్ సినిమాలు రాలేదు. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’ తో ఆయన తనలోని వింటేజ్ టేకింగ్ యాంగిల్ ని బయటకి తీసుకొచ్చినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.

    ఈ నెల 20 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన మూడవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సాంగ్ కోసం సుమారుగా 20 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ చిత్రంలో ఎన్నో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ని దాచిపెట్టాడట డైరెక్టర్ శంకర్. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ పాటకు డ్యాన్స్ చేస్తాడట. ఈ డ్యాన్స్ అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ‘రా మచ్చ..మచ్చ’ సాంగ్ లో రామ్ చరణ్ తలకు ఎర్ర కండువా చుట్టుకొని, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ కటౌట్ ముందు ఇంద్రలోని వీణ స్టెప్ వేసిన గెటప్ ని చూసే ఉంటాము.

    ఇప్పుడు ఆయన చిరంజీవి మీద మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ సాంగ్ కి కూడా డ్యాన్స్ వేయడం అభిమానులకు కనుల పండుగ కాక మరేంటి..కానీ ఇలాంటి సన్నివేశాలు ఈమధ్య ఆడియన్స్ కి క్రింజ్ అనిపిస్తున్నాయి. మరోపక్క పాన్ వరల్డ్ స్టార్ రేంజ్ కి ఎదిగిన తర్వాత కూడా, ఇంకా చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లను ఉపయోగించుకోవడం ఏమిటి అని సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తుంటే, ఎంత ఎత్తుకి ఎదిగిన మూలాలు మర్చిపోకుండా తన తండ్రి, బాబాయ్ ని గుర్తు చేసుకుంటున్నాడంటే రామ్ చరణ్ కి వాళ్లిద్దరూ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు అంటూ మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జనవరి 10 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.