https://oktelugu.com/

Pushpa 2 The Rule Trailer : ‘పుష్ప 2’ ట్రైలర్ లో ఈ అరగుండు వ్యక్తి ఎవరో గమనించారా..? ఇలా మీరు గమనించని ఎన్నో విషయాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

ఈ చిత్రం లో అల్లు అర్జున్ తానూ సంపాదించిన డబ్బు మొత్తాన్ని పేద ప్రజలకు పంచుతున్నట్టు గ్లిమ్స్ వీడియోలో చూపించారు. ఆ యాంగిల్ ని ఎందుకో ట్రైలర్ లో చూపించలేదు సుకుమార్.

Written By:
  • Vicky
  • , Updated On : November 17, 2024 / 07:12 PM IST

    Allu Arjun Pushpa 2 The Rule Trailer Review

    Follow us on

    Pushpa 2 The Rule Trailer : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదలై మంచి రెస్పాన్స్ ని తెచ్చుకుంది. పార్ట్ 1 లో పుష్ప అంటే ఫైర్, కానీ పార్ట్ 2 లో మాత్రం పుష్ప అంటే వైల్డ్ ఫైర్. డైరెక్టర్ సుకుమార్ న్యారేషన్ విషయంలో మొదటి నుండి తోపు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ క్యారక్టర్ ఏ ప్రధాన బలం. ఆ క్యారక్టర్ లో ఉండే యాటిట్యూడ్ కి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కనెక్ట్ అయ్యారు. ఈరోజు ‘తగ్గేదేలే’ మ్యానరిజాన్ని మనం నిజ జీవితంలో ఎదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటాము. ఆ రేంజ్ ప్రభావం చూపించింది ఆ క్యారక్టర్. పార్ట్ 2 లో ఆ క్యారక్టర్ ని మరింత పవర్ ఫుల్ గా సానబెట్టినట్టు అనిపించింది. ట్రైలర్ చివర్లో అల్లు అర్జున్ పుర్రెల మాల మెడలో వేసుకొని ‘తగ్గేదేలే’ అని డైలాగ్ చెప్తుంటే అభిమానుల రోమాలు నిక్కపొడుచుకున్నాయి.

    అయితే ఈ ట్రైలర్ లో ఎవ్వరూ గమనించని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. జాతర ఎపిసోడ్ లో ఒక వ్యక్తి చీర కట్టుకొని అరగుండు గెటప్ లో కనిపిస్తాడు. అతని మెడలో చెప్పుల మాల ఉంటుంది. ఇందులో అరగుండులో కనిపించిన నటుడు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. చాలా మంది ముందుగ ఫహద్ ఫాజిల్ అనుకున్నారు. కానీ అతను కాదు. పుష్ప పార్ట్ 1 లో కనిపించిన జాలి రెడ్డి గుర్తున్నాడా..?, ఆ పాత్రనే ఇది. ఈ పాత్రని కన్నడ యంగ్ హీరో డాలీ ధనంజయ చేసాడు. శ్రీవల్లి తో అసభ్యంగా ప్రవర్తించినందుకు జాలి రెడ్డి ని చిత్తుచిత్తుగా కొడుతాడు పుష్ప. మళ్లీ అతను పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పుష్ప ని దొంగ దెబ్బ తీసేందుకు జాతర లో ఇలాంటి వేషం వేసుకొని వచ్చినట్టుగా అనిపించింది.

    ఇదంతా పక్కన పెడితే ట్రైలర్ మధ్యలో ఎర్ర చందనాతో శవాన్ని పేర్చి కాలుస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక చనిపోతుంది అనే విషయం సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రచారం అవుతూనే ఉంది. ఆమె శవాన్నే పుష్ప కాల్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో విలువైన ఎర్ర చందనం తో ఒక శవాన్ని కాల్చడం అంటే, కచ్చితంగా అతనికి ఎంతో ఇష్టమైన వ్యక్తి చనిపోయి ఉండాలి. ఇది రష్మిక మాత్రమే కాకుండా, అల్లు అర్జున్ తల్లి పాత్ర కూడా అయ్యుండొచ్చు. ఓవరాల్ ట్రైలర్ మొదటి భాగం ఎంత ఇంటెన్స్ గా అనిపించిందో, రెండవ భాగం అంతకంటే ఎక్కువ ఇంటెన్స్ గా అనిపించింది. ఈ చిత్రం లో అల్లు అర్జున్ తానూ సంపాదించిన డబ్బు మొత్తాన్ని పేద ప్రజలకు పంచుతున్నట్టు గ్లిమ్స్ వీడియోలో చూపించారు. ఆ యాంగిల్ ని ఎందుకో ట్రైలర్ లో చూపించలేదు సుకుమార్.