Indian Cinema Revenue: ఏడాదికి రూ. 12000 కోట్ల రెవెన్యూ… ఎల్లలు దాటిన ఇండియన్ సినిమా!

ఈ ఏడాది పఠాన్ వంటి భారీ హిట్ తో మొదలైంది. షారుఖ్ ఖాన్ పఠాన్, రణ్వీర్ సింగ్ రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించింది.

Written By: Raj Shekar, Updated On : September 18, 2023 8:57 am

Indian Cinema Revenue

Follow us on

Indian Cinema Revenue: బాలీవుడ్ 2022లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. బడా బడా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, హృతిక్ రోషన్ విక్రమ్ వేద, అక్షయ్ కుమార్ రామ్ సేతు, షాహిద్ కపూర్ జెర్సీ ఒకటేంటి విడుదలైన ప్రతి సినిమా దారుణ పరాజయం చవిచూశాయి. హిందీ జనాలు థియేటర్స్ కి రావడం మానేశారనే అభిప్రాయానికి వచ్చారు నిర్మాతలు. బ్రహ్మాస్త్ర పర్లేదు అనిపించినా నష్టాలు తప్పలేదు. ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ బులియా 2, గంగూబాయ్ కతియావాడి వంటి చిత్రాలు మినహాయిస్తే… నిర్మాతలు గతంలో ఎన్నడూ చూడని నష్టాలు చవిచూశారు.

దీనికి కోవిడ్ కూడా కారణమైంది. ఆ భయం నుండి ప్రేక్షకులు బయటపడేందుకు కొంత సమయం పట్టింది. అయితే 2023 హిందీ సినిమాకు కాసులు కురిపించింది. ట్రేడ్ అనలిస్ట్ ఆశిష్ పేర్వాని మాట్లాడుతూ… 2023లో రూ. 11000 నుండి 12000 కోట్ల థియేట్రికల్ రెవెన్యూ అంచనా వేయవచ్చు అన్నారు. అన్ని భాషల్లో హిందీ సినిమాలు ఆదరణ దక్కించుకోవడం, చెప్పుకోదగ్గ టికెట్ ధరలు ఇందుకు దోహదం చేశాయి. కోవిడ్ కి ముందు పరిస్థితి ఈ ఏడాది కనిపించింది అన్నారు. ఈ ఆదాయం కేవం డెమిస్టిక్ వరకే, ఓవర్సీస్ ఆదాయం పరిగణలోకి తీసుకోలేదు అన్నారు.

ఈ ఏడాది పఠాన్ వంటి భారీ హిట్ తో మొదలైంది. షారుఖ్ ఖాన్ పఠాన్, రణ్వీర్ సింగ్ రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రప్పించింది. గదర్ 2, జవాన్, డ్రీం గర్ల్ 2 బాక్సాఫీస్ షేక్ చేశాయి. మరొక ట్రేడ్ అనలిస్ట్ అతుల్ మోహన్ మాట్లాడుతూ… 2023 ఇండియన్ సినిమాకు గత వైభవం తీసుకొచ్చింది. ముఖ్యంగా జులై నుండి సెప్టెంబర్ మధ్య భారీ విజయాలు దక్కాయి. రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని రూ. 150 కోట్ల వసూళ్లు రాబట్టింది. గదర్ 2 రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ దాటేసింది.

అక్షయ్ కుమార్ ఓఎంజి 2 రూ. 135 కోట్ల వసూళ్లు అందుకుంది. డ్రీమ్ గర్ల్ 2 సైతం రూ. 100 కోట్ల మార్క్ చేరుకుంది. ఇక జవాన్ డొమెస్టిక్ గా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జవాన్ ఇంకా చెప్పుకోదగ్గ వసూళ్లతో థియేటర్స్ లో రన్ అవుతుంది, అన్నారు.

2023 చివర్లో సల్మాన్ ఖాన్ టైగర్, రన్బీర్ కపూర్ యానిమల్, షారుక్ ఖాన్ డంకీ చిత్రాల విడుదల ఉంది. ఇవన్నీ భారీ చిత్రాలు కాగా వేల కోట్ల రెవెన్యూ తెచ్చిపెట్టనున్నాయి. ఈ క్రమంలో ఒక్క హిందీ ఇండస్ట్రీ ఈ ఏడాది రూ. 12000 వేల కోట్ల రెవెన్యూ రాబట్టనుందని అంచనా వేస్తున్నారు. ఓటీటీ హవా నేపథ్యంలో ఇక జనాలు థియేటర్స్ కి రారు అంటూ పలు విశ్లేషణలు భయపెట్టాయి. కానీ ప్రేక్షకుడు థియేటర్స్ అనుభవం కోరుకుంటాడని మరోసారి రుజువైంది. ఇది సినిమా పరిశ్రమకు శుభసూచికం అని చెప్పొచ్చు…