సంక్షేమ పథకాలు రద్దు చేయాలని కోరుదామనుకుంటున్నా: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని సీఎంను కోరుదామనుకుంటున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే అవి మరిచిపోయే అలవాటు ఉందన్నారు. అందువల్ల ఇప్పుడు సంక్షేమ పథకాలు రద్దు చేసి ఎన్నికల ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల పాటు ఉచిత కరెంటు కాకుండా కేవలం 3,4 గంటలే ఇవ్వాలని కోరుతానన్నారు. మేము […]

Written By: Suresh, Updated On : December 15, 2020 2:55 pm
Follow us on

తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని సీఎంను కోరుదామనుకుంటున్నానని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే అవి మరిచిపోయే అలవాటు ఉందన్నారు. అందువల్ల ఇప్పుడు సంక్షేమ పథకాలు రద్దు చేసి ఎన్నికల ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రంలో 24 గంటల పాటు ఉచిత కరెంటు కాకుండా కేవలం 3,4 గంటలే ఇవ్వాలని కోరుతానన్నారు. మేము చేస్తున్న మంచి పనులు సామాన్యులు అర్థం చేసుకోవడం లేదన్నారు. పనికిమాలిన భావాలకు లోనవుతూ అభివ్రుద్ధి విషయాన్ని మరిచిపోతున్నారన్నారు.