Viral Video: చిన్నప్పుడే కనిపిస్తుందట సిరిగల్ల గుణం. ఎవరికైనా మంచి గుణాలు పుట్టుకతోనే వస్తాయి. అందుకే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. మంచి అనేది వారి రక్తంలోనే ఉంటుంది. పులులు, సింహాలు తయారు చేస్తే కావు. అది రక్తంలో ఉండాలి అని ఓ సినిమాలో చెప్పినట్లు చిన్నారుల్లో సుగుణాలు అలవరిస్తే వారి బతుకు బంగారు బాటే అవుతుంది. మర్యాద, గౌరవం ఇచ్చిపుచ్చుకునేవి. వాటిని జాగ్రత్తగా ఆచరిస్తేనే గుర్తింపు వస్తుంది. మన మనుగడకు దోహదం చేస్తుంది. మంచి గుణాలు ఒకరు నేర్పితే వచ్చేవి కావు. పుట్టుకతోనే మనక మంచి మర్యాద అలవడితేనే సమాజంలో విలువ పెరుగుతుంది.
మెట్రో స్టేషన్ వద్ద నలుగురు ఆర్మీ జవాన్లు ఉన్నారు. దీంతో ఓ చిన్నారి వారి వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లింది. వారిని కొద్దిసేపు అలాగే చూసింది. వెంటనే ఓ సైనికుడు పాదాలు తాకి దండం పెట్టింది. ఆ సైనికుడు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. చిన్నారి తలపై నిమిరి ఆశీర్వదించాడు. ఎండనక, వాననక, చలిని సైతం లెక్కచేయకుండా సరిహద్దులో కాపలా కాసే సైనికులకు మనం ఎంత చేసినా తక్కువే. అలాంటి చిన్నారికి వారిని తాకి గౌరవం చూపించాలని ఆలోచన రావడం ఆ చిన్నారి తల్లిదండ్రుల అదృష్టం.
Also Read: Ileana: స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఇలియానా సరసాలు.. ఫొటోలు వైరల్
పాప చేసిన పనికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. చిన్నారిని కన్న తల్లిదండ్రులు ధన్యులని ట్వీట్ చేసింది. పాపకు ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు అని కీర్తించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లక్షల్లో లైకులు, కోట్లలో షేర్లు వస్తున్నాయి. చిన్నారి చేసిన మర్యాదకు అందరు ఫిదా అవుతున్నారు. మనకు రాని ఆలోచన అంత చిన్న పాపకు రావడం హర్షించదగినదే. పిల్లలకు చిన్నతనం నుంచే విలువలున్న విషయాలు బోధించడం వల్ల వారి జీవనంలో అన్ని మంచి ఆలోచనలే వస్తాయనడంలో సందేహం లేదు.
దేశ భద్రతలో నిరంతరం పాటుపడే సైనికుడికి మనం అందించే నిజమైన నీరాజనం ఇదే. అనుక్షణం దేశాన్ని కాపాడే బాధ్యతలు నిర్వహిస్తూ భార్యా పిల్లలకు దూరంగా ఉండటం నిజంగా వారికే చెల్లుతుంది. అలాంటి వీర జవాన్లకు గౌరవం ఇవ్వడం నిజంగా అభినందనీయమే. చిన్నారి చేష్టలకు అందరు మురిసిపోతున్నారు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు అని పొగుడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీర సైనికులకు చిన్నారి వందనం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది.
Also Read:Naga Babu And Roja Remuneration: నాగబాబు కంటే రోజాకు ఎక్కువ రెమ్యూనరేషన్.. సంచలన నిజాలు లీక్
Raising patriotic young minds is a duty every parent owes to this great nation.
Jai Hind 🇮🇳 pic.twitter.com/mhAjLbtOvG
— P C Mohan (@PCMohanMP) July 15, 2022