https://oktelugu.com/

Ileana: భర్త గురించి అలా అంటే తట్టుకోలేను అంటున్న ఇలియానా..

అప్పట్లో తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది ఇలియానా. తెలుగులో మాత్రమే కాదు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి తన సత్తా చాటింది. ఇలా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరం అయింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 18, 2024 / 11:03 AM IST

    Ileana

    Follow us on

    Ileana: నాజూకు నడుముతో ఎంతో మంది మది దోచింది ఇలియానా. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. కానీ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు ఈ బ్యూటీ. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. పోకిరి, కిక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో తన రేంజ్ ను అమాంతం పెంచుకుంది ఈ నడుము బ్యూటీ.

    అప్పట్లో తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది ఇలియానా. తెలుగులో మాత్రమే కాదు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి తన సత్తా చాటింది. ఇలా కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఇండస్ట్రీకి దూరం అయింది. అయితే తెలుగులో అవకాశాలు జోరు మీద ఉన్న సమయంలోనే బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది.. కానీ అక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలోనే ఓ వ్యక్తిని ప్రేమించడం.. బ్రేకప్ అవడంతో.. డిప్రషన్ లోకి వెళ్లింది ఇలియానా.

    సినిమాల్లో కనిపించని ఇలియానా బరువు కూడా బాగా పెరిగింది. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకున్నా కుదరలేదు. అయితే రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించినా.. ఆ సినిమా పెద్ద క్రేజ్ ను సంపాదించి పెట్టలేదు. దీని వల్ల మరోసారి ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే గర్భం దాల్చి అందరికీ షాక్ ఇచ్చింది. చాలా రోజుల వరకు తన భర్త ఎవరో కూడా చెప్పకుండా దాచింది.

    తాజాగా ఇలియానా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నన్ను పెళ్లి చేసుకోకుండా తల్లి అయిందని చాలా ట్రోల్ చేశారు..నన్నే కాదు నా భర్తను కూడా ట్రోల్ చేశారు. గర్భవతి అయినా కూడా సినిమాలు చేయాలి అనుకున్నా.. కానీ కుదరలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిడ్డ పుట్టినప్పుడు ఒత్తిడికి లోనైతే.. నా భర్తనే నాకు సపోర్ట్ చేశాడు. కానీ మా బంధం గురించి బయట పెట్టడం నాకు ఇష్టం లేదు. నా గురించి ఏమన్నా తట్టుకుంటా.. కానీ నా భర్త గురించి అంటే మాత్రం తట్టుకోలేను అంటూ తెలిపింది ఇలియానా.