https://oktelugu.com/

Guppedantha Manasu: గుప్పెడంత మనసు రిషి వచ్చేస్తున్నాడోచ్… ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

మళ్ళీ స్క్రీన్ పై రిషిధార కెమిస్ట్రీ ఎంజాయ్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ దిల్ కుష్ చేసే పోస్ట్ ఒకటి పెట్టాడు ముఖేష్ గౌడ.

Written By:
  • S Reddy
  • , Updated On : March 18, 2024 / 11:10 AM IST

    guppedantha-manasu-hero-rishi

    Follow us on

    Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో కొంత కాలంగా ముఖేష్ గౌడ కనిపించడం లేదు. కానీ మూడు నెలల్లో రిషి వస్తాడు అంటూ వసుధార చెబుతూ వస్తుంది. వసు పక్కన రిషి కనిపించకపోవడంతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారు. రిషి సీరియల్ లో లేనప్పటికీ అతని చుట్టూ కథంతా నడిపిస్తున్నారు. రిషి బ్రతికే ఉన్నాడు కచ్చితంగా వస్తాడు అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపే ప్రయత్నం చేస్తున్నారు డైరెక్టర్. గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ రిషి త్వరగా రావాలని కోరుకుంటున్నారు.

    మళ్ళీ స్క్రీన్ పై రిషిధార కెమిస్ట్రీ ఎంజాయ్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ దిల్ కుష్ చేసే పోస్ట్ ఒకటి పెట్టాడు ముఖేష్ గౌడ. తనకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ” అంతం ఎక్కడో ఆరంభం అక్కడే .. సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు .. వచ్చేస్తున్నా” అని అర్థం వచ్చేలా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. తన లేటెస్ట్ లుక్ కి సంబంధించిన ఫోటోలు షేర్ చేశాడు.

    అయితే గుప్పెడంత మనసు సీరియల్ లోకి తిరిగి వస్తున్నాడా? లేదంటే మరో కొత్త సీరియల్ ఏమైనా చేస్తున్నాడా? లేక మూవీ అప్డేట్ గురించి చెప్తున్నాడా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ మాత్రం రిషి గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా అతన్ని అభిమానించే లేడీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖేష్ గౌడ తాజా ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాడు.

    అయితే ముకేశ్ గౌడ సడెన్ గా సీరియల్ నుంచి ఎందుకు తప్పుకున్నాడో క్లారిటీ లేదు. ఈ సూపర్ హిట్ సీరియల్ నుండి ముఖేష్ గౌడను తప్పించారా లేక? ఆయనే స్వయంగా తప్పుకున్నాడా? అనే సందేహాలు కొనసాగుతున్నాయి. అయితే ఓ మూవీ కోసం అతడు సీరియల్ కి బ్రేక్ ఇచ్చినట్లు సమాచారం. ముఖేష్ గౌడ పోస్ట్ మాత్రం అతడు రీ ఎంట్రీ ఇస్తున్నాడనే భావన కలిగిస్తుంది. దీని గురించి పూర్తి క్లారిటీ రావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.