Sai Pallavi : సినిమా ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఎక్కువగా ఉంటుందనే చెప్పాలో. ఇక వాళ్లతో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ అనేది చాలా తక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల హీరోయిన్ గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం అయితే ఉండదు. సాయి పల్లవి లాంటి నటి మాత్రం తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటేనే ఆమె సినిమా చేస్తుంది లేకపోతే మాత్రం సినిమా చేయనని చెప్పేస్తుంది…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న శివ కార్తికేయన్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ అయితే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అవుతాయి. ముఖ్యంగా ఆయన నటించిన సినిమాల్లో వైవిధ్యం అయితే ఉంటుంది. ఇక అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన ప్రిన్స్ అనే సినిమా ఆయనలోని కామెడీ యాంగిల్ ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆయన తమిళ్ డైరెక్టర్ అయిన రాజకుమార్ పెరియసామి దర్శకత్వంలో చేసిన ‘అమరన్ ‘ సినిమాతో 2024 సంవత్సరంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఆర్మీ మేజర్ అయిన ‘ముకుంద్ వరదరాజన్’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా శివ కార్తికేయన్ కి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు సాధించని వసూళ్ల రికార్డులను కూడా ఈ సినిమా సాధించింది. ఇక మూవీ లాంగ్ రన్ లో 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
అయితే ఈ సినిమాలో శివ కార్తికేయన్ తో పాటు అతని భార్యగా నటించిన సాయి పల్లవి పాత్ర కూడా సినిమాకి జీవం పోసిందనే చెప్పాలి. చాలామంది ప్రేక్షకులు కేవలం సాయి పల్లవి కోసమే ఈ సినిమాని చూసినవారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ సినిమాలో తను పోషించిన నటన ఒకెత్తయితే తను ఆడియన్స్ ను గ్రాప్ చేసుకున్న విధానం మరొకెత్తనే చెప్పాలి.
మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. అయితే ఈ సినిమా కోసం ఆమె రెమ్యూనరేషన్ గా ఎంత తీసుకుంది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ఆమె దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సాయి పల్లవి ట్రెండ్ నడుస్తుంది.
కాబట్టి 10 కోట్లు కాదు 20 కోట్లైన ఇచ్చి తనతో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారనే చెప్పాలి… మరి ఈ సినిమా సక్సెస్ తో ఆమె మరొక మెట్టు పైకి ఎక్కిందనే చెప్పాలి. ఇక ఇప్పుడు రాబోతున్న తండేల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోయిన్ గా మరోసారి మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తుంది….