Vishal : గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో తమిళ హీరో విశాల్ ఆరోగ్యం గురించి పలు రకాల కథనాలు అభిమానులను కంగారుకి గురి చేసిన సంగతి తెలిసిందే. ఆయన హీరో గా నటించిన ‘మదగజరాజ’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని 4K కి మార్చి ఈ నెల 11 వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కి విచ్చేసిన విశాల్ గుర్తుపట్టలేని అవతారం లో కనిపించి, మాట్లాడుతున్న సమయంలో చేతులు గజగజ వణికిపోవడాన్ని చూసి అసలు ఏమైంది మా అభిమాన హీరో కి అంటూ ఫ్యాన్స్ పోస్టులు వేయడం మొదలు పెట్టారు. చిన్న విషయాన్నీ పెద్దది చూసి వ్యూస్ కోసం ట్రిక్స్ ప్లే చేసే పలు యూట్యూబ్ చానెల్స్ దారుణమైన థంబ్ నెయిల్స్ ని పెట్టి అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేసారు.
అయితే విశాల్ ఆరోగ్య పరిస్థితి పై ప్రముఖ స్టార్ హీరోయిన్ కుష్బూ మాట్లాడుతూ ‘విశాల్ గారు గత కొద్దిరోజుల నుండి డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. 11 ఏళ్ళ తర్వాత ఆయన హీరోగా నటించిన ‘మదగజరాజ’ సినిమా విడుదల అవుతున్నందుకు, ఆయన ఎలా అయినా ఈ ఈవెంట్ లో పాల్గొనాలి అనే ఉత్సాహంతో అతి కష్టం మీద వచ్చి మాట్లాడాడు. ఆరోజు ఆయనకీ 103 డిగ్రీల ఫీవర్ ఉంది. అందుకే వణికిపోయాడు. ఈవెంట్ పూర్తి అయిన వెంటనే విశాల్ ని ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆయన మెల్లగా కోలుకుంటున్నారు, అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదు. కొంత మంది వ్యూస్ కోసం లేని పోనీ అసత్య ప్రచారాలను చేస్తున్నారు. వాటిని నమ్మి మోసపోకండి’ అంటూ కుష్బూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన మాటలకు విశాల్ అభిమానులు కాస్త రిలాక్స్ అయ్యారు.
ఇదంతా పక్కన పెడితే తెలుగులో విశాల్ కి మంచి క్రేజ్ ఉంది అనే విషయం తెలిసిందే. పందెం కోడి, పొగరు, భయ్యా , పిస్తా, భరణి, పూజ, అభిమన్యుడు మరియు మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. కానీ గత కొంత కాలంగా ఆయన వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్నాడు. ఈ నేపథ్యం లో ఆయన మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావడానికి ‘డిటెక్టివ్’ సీక్వెల్ తో మన ముందుకు రాబోతున్నాడు. 2017 వ సంవత్సరం లో తెలుగు, తమిళ భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించిన ఈ చిత్రం లో వినయ్ రాయ్, ఆండ్రియా జరేమియా విలన్ రోల్స్ లో కనిపించారు. మరి సీక్వెల్ లో ఎవరెవరు నటించబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఈ సీక్వెల్ కి విశాల్ హీరోగా నటిస్తూనే, దర్శకత్వం కూడా వహిస్తున్నాడు.