NZ Vs SL 2nd Odi: న్యూజిలాండ్(Newziland), శ్రీలంక( Srilanka) జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ బుధవారం(జనవరి 8న) హామిల్డన్‌లోని ది సెడాన్ పార్క్‌లో జరుగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే తొలి వన్డేలో న్యూజిలాండ్ గెలిచింది. సిరీస్‌లో ముందు ఉన్న ఆతిథ్య జట్టును కట్టడి చేయాలని శ్రీలంక భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. వెల్లింగ్‌టన్‌లో జరిగిన తొలి వన్డేలో శ్రీలంక పూర్తిగా ఆలౌట్ చేయడంతోపాటు 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 178 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ అవిష్క ఫెర్నాండో 56 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరఫున మాట్ హెన్రీ 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 179 పరుగులు సాధించింది. ఓపెనర్ విల్ యంగ్ అజేయంగా 90 పరుగులు చేశాడు. 27 ఓవర్లలోనే లక్ష్యం సాధించారు.
రెండో వన్డే కీలకం..
రెండో వన్డే ఇప్పుడు శ్రీలంకకు చాలా కీలకం. ఇరు జట్లు మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. డే అండ్ నైట్ జరిగే ఈ మ్యాచ్ జరిగే హామిల్టన్ పిచ్‌పై పరుగుల వరద పారుతుందని నిపుణులు పేర్కొటున్నారు. ఇక వాతావరణం మేఘావృతమై ఉంటుంది. చినుకులు రాలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పగలు 20 డిగ్రీలు, రాత్రి 15 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఇక సెడాన్ పార్క్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఈ మ్యాచ్ కూడా తక్కువ స్కోర్ మ్యాచ్‌గానే మిగిలే వకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 233 పరుగులు నుంచి 250 పరుగులు చేసే అవకాశం ఉంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 13 సార్లు విజయం సాధించాయి. రెండోబ్యాటింగ్ చేసిన జట్లు 23 సార్లు గెలిచాయి. ఈ నేపథ్యంలో టాస్ కూడా కీలకం కానుంది. చివరిసారి శ్రీలంక, న్యూజిలాండ్ ఈ మైదానంలోనే తలపడ్డాయి. శ్రీలంకపై న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. శ్రీలంక 157 పరుగులకు ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ 33 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.