https://oktelugu.com/

Daku Maharaj : ‘డాకు మహరాజ్’ ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసిందా..? ఇందులో స్ట్రీమింగ్ అవుతుందంటే..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.

Written By:
  • Gopi
  • , Updated On : January 16, 2025 / 01:56 PM IST

    Daku Maharaj

    Follow us on

    Daku Maharaj : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి బాలయ్య బాబు లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న బాలయ్య ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు… ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. శ్రీ ‘నందమూరి తారకరామారావు’ గారి నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంటూ ఆయనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక సంక్రాంతి కానుకగా ఆయన చేసిన ‘డాకు మహారాజ్’ అనే సినిమాని రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు కెరియర్ లో రానటువంటి కలెక్షన్స్ ను రాబడుతూ ముందుకు సాగుతున్న ఈ సినిమాతో బాలయ్య తనకంటూ ఒక ఐడెంటిటిని అయితే సంపాదించుకున్నాడు. మరి ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా ప్రేక్షకులను అలరిస్తూ ఉండడమే కాకుండా మాస్ లో కూడా ఎక్కువగా ఫాలోయింగ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి…

    ఇక ఈ సినిమా విషయంలో బాబీ కూడా చాలావరకు కేర్ఫుల్ గా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. ప్రతి సీన్ ని చాలా కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అందువల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఓటిటి కి సంబంధించిన డేట్స్ ని అనౌన్స్ చేశారు.

    మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా పర్టిక్యూలర్ గా డేట్ అయితే చెప్పలేదు కానీ సినిమా యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాని అందుబాటులోకి తేవడానికి రెడీ అవుతున్నారు. మరి ఏది ఏమైనా ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తూ భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ముందుకు సాగుతుంది.

    ఇక ఇప్పటికే వందకోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా తొందర్లోనే 200 కోట్ల మార్కును కూడా చేరుకోబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక బాలయ్య బాబు కెరీర్లో 200 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఏదీ లేదు. ఈ సినిమాతో ఆ రికార్డుని కొల్లగొట్టి సీనియర్ హీరోలందరిలో తనకంటూ ఒక టాప్ మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…