Devara: ‘దేవర’ లో ఈ చిన్న మార్పులు చేసుంటే ఇండస్ట్రీ షేక్ అయ్యేది..కొరటాల తప్పు చేసింది అక్కడే!

కథ చాలా సాధారణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఎదో బలవంతంగా పెట్టినట్టు గా అనిపిస్తుంది. ఇవన్నీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చేందుకు కారణం గా నిలిచాయి.

Written By: Vicky, Updated On : September 27, 2024 12:59 pm

Devara Movie

Follow us on

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అర్థరాత్రి నుండి షోస్ మొదలైన ఈ చిత్రానికి ఆరంభం లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ మెల్లగా టాక్ పెరుగుతూ పోతుంది. అయితే ‘దేవర’ చిత్రానికి ఆరంభం లో డివైడ్ టాక్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఆరేళ్ళ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో గా నత్త నడకన స్క్రీన్ ప్లే నడవడం ఈ సినిమాకి డివైడ్ టాక్ రావడానికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సన్నివేశాలు అదిరిపోవడం తో ఫస్ట్ హాఫ్ ఓవరాల్ గా పర్వాలేదు అని అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా గాడి తప్పింది అని అనొచ్చు. ఒక్కటంటే ఒక్క వావ్ మొమెంట్స్ లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం సాగుతుంది.

కథ చాలా సాధారణంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఎదో బలవంతంగా పెట్టినట్టు గా అనిపిస్తుంది. ఇవన్నీ ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చేందుకు కారణం గా నిలిచాయి. అయితే ఈ చిత్రం లో కొరటాల శివ కొన్ని మార్పులు, చేర్పులు చేసుంటే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేదని విశ్లేషకుల అభిప్రాయం. సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి ఫస్ట్ హాఫ్ లో జరగాల్సిన కథ సెకండ్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో జరగాల్సిన కథ ని ఫస్ట్ హాఫ్ లో పెట్టినట్టుగా అనిపిస్తుంది. రెండిటిని స్వాప్ చేసుంటే ఫలితం మరోలా ఉండేదని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో అసలు హీరోయిన్ క్యారక్టర్ అవసరం లేదు. కథకు ఆమె పాత్ర కూడా అద్దంగానే అనిపించింది. ఎదో ఒక్క పాటలో ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ వేయాలి కాబట్టి ఆమెని తీసుకున్నట్టుగా అనిపించింది. కొరటాల శివ కథని చాలా పవర్ ఫుల్ గా రాసుకున్నాడని, కానీ దానిని పాన్ ఇండియన్ లెవెల్ స్కోప్ లో తెరకెక్కించే క్రమం లో తడబడ్డాడు అని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపించింది. 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఈ చిత్రం కోసం ఖర్చు చేశామని చెప్పుకొచ్చారు. కానీ ఖర్చు పెట్టిన ఒక్క పైసా కూడా వెండితెర మీద కనిపించలేదు.

అసలు సముద్రంలో ఉన్న అనుభూతి ప్రేక్షకులకు అనిపించదు. ఎదో స్విమ్మింగ్ పూల్ సెట్ లో ఆ షాట్స్ ని తీసినట్టుగా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ హైలైట్స్ లో ఒకటిగా చెప్పొచ్చు. కొరటాల విషయం లేని సన్నివేశాలు రాసినప్పటికీ, అనిరుద్ వాటిని తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పైకి లేపినట్టుగా చూసే ప్రేక్షకులకు అనిపించింది. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, ఎప్పటి లాగానే ఆయన ఈ సినిమాలో కూడా జీవించేసాడు. అనిరుద్, ఎన్టీఆర్ తో పాటుగా కొరటాల శివ కూడా డ్యూటీ చేసుంటే ఈరోజు ‘దేవర’ వెయ్యి కోట్లు కొట్టే సినిమాగా నిలిచేది అని విశ్లేషకుల అభిప్రాయం.