https://oktelugu.com/

Telangana Slang : తెలంగాణ స్లాంగ్ వాడితే సినిమా బంపర్ హిట్..టాలీవుడ్ లో నడుస్తున్న సరికొత్త సక్సెస్ ఫార్ములా

అయితే తెలంగాణా స్లాంగ్ ఒక మోస్తరుగా వాడితే ఎలాంటి సమస్య లేదు కానీ, పూర్తి స్థాయి తెలంగాణ బాషా వాడడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మూవీ లవర్స్ కి బాష అర్థం కావడం లేదు, ఫలితంగా తెలంగాణ ప్రాంతం లో దుమ్ము లేపిన 'దసరా' మరియు 'బలగం' వంటి చిత్రాలు ఆంధ్ర లో యావరేజి గా ఆడాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 27, 2023 / 06:47 PM IST
    Follow us on

    Telangana Slang : ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక సెంటిమెంట్ క్లిక్ అయితే అదే సెంటిమెంట్ ని ఫాలో అవ్వడం సర్వసాధారణం. అలా ఫాలో అయ్యి వరుసగా సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామందే ఉన్నారు. రీసెంట్ గా తెలుగు సినిమా పరిశ్రమని అలా ఒక సెంటిమెంట్ బాక్స్ ఆఫీస్ ని శాసిస్తుంది.ఆ సెంటిమెంట్ పేరే తెలంగాణ స్లాంగ్. ఈ ఏడాది రెండు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిల్చిన ‘బలగం’ మరియు ‘దసరా’ చిత్రాలు తెలంగాణ నేటివిటీ తో తీస్తూనే, ఊర నాటు తెలంగాణ బాషని ఉపయోగించారు.

    అది ఆడియన్స్ కి తెగ నచ్చేసింది, ఫలితంగా కాసుల కనకవర్షం కురిపించాయి. ఇప్పుడు రీసెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ‘మేము ఫేమస్’ చిత్రం కూడా పూర్తిగా తెలంగాణ నేటివిటీ మరియు స్లాంగ్ తో తీసిన చిత్రం.కొత్తవాళ్లతో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుంది.

    గత ఏడాది కూడా ఇంతే, యూత్ ని ఒక ఊపు ఊపేసిన డీజే టిల్లు చిత్రం అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి కారణం తెలంగాణ స్లాంగ్ , ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ పోతానే ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ లో ఉన్న హ్యూమర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడం వల్లే ఇప్పుడు అది సక్సెస్ ఫార్ములా గా మారిపోయింది. స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా తెలంగాణ స్లాంగ్ ని బాగా వాడి , సూపర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నారు.

    అయితే తెలంగాణా స్లాంగ్ ఒక మోస్తరుగా వాడితే ఎలాంటి సమస్య లేదు కానీ, పూర్తి స్థాయి తెలంగాణ బాషా వాడడం వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మూవీ లవర్స్ కి బాష అర్థం కావడం లేదు, ఫలితంగా తెలంగాణ ప్రాంతం లో దుమ్ము లేపిన ‘దసరా’ మరియు ‘బలగం’ వంటి చిత్రాలు ఆంధ్ర లో యావరేజి గా ఆడాయి. మేకర్స్ ఈ ఒక్క విషయాన్నీ పరిగణలోకి తీసుకుంటే కొన్నేళ్ల పాటు తెలంగాణ స్లాంగ్ టాలీవుడ్ ని ఏలేస్తాది అని అంటున్నారు విశ్లేషకులు.