Chiranjeevi: ఏఐ చేస్తున్న మ్యాజిక్ తో అమితాబ్ కి ప్రశంసలు దక్కితే, చిరంజీవి మాత్రం విమర్శలను ఎదుర్కొన్నాడా..? కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో రోజుకొక టెక్నాలజీ వచ్చి సినిమా తీసే విధానాన్ని చాలా ఈజీ గా మారుస్తున్నాయి. ఒకప్పుడు రీల్ లో సినిమాలను తీసేవారు. ఆ తర్వాత సినిమా డిజిటల్ అవ్వడంతో రీల్స్ మరుగున పడిపోయాయి. ఇక ఇప్పుడు మరికొన్ని టెక్నాలజీలు రావడంతో సినిమాని చాలా ఈజీగా తీసేస్తున్నారు.

Written By: Gopi, Updated On : September 6, 2024 9:45 am

Chiranjeevi

Follow us on

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీ మొత్తం టెక్నాలజీ చుట్టు తిరుగుతుంది. ఒక సినిమాలో ఏది కావాలన్నా ఏ ఐ తోనే క్రియేట్ చేసుకుంటూ మేకర్స్ సినిమాని చాలా ఈజీగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక సీనియర్ హీరోలైతే వాళ్ళ యంగ్ లుక్కుని కూడా ఏఐ లోనే డిజైన్ చేయించి సినిమాలో వాడుతున్నారు. నిజానికి అది కొంతమందికి ప్లస్ అయితే మరి కొంత మందికి మాత్రం మైనస్ గా మారుతుంది. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా సూపర్ సక్సెస్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కల్కి సినిమాలో అమితాబచ్చన్ అశ్వద్ధామ క్యారెక్టర్ ని పోషించాడు. అందులో యంగ్ అశ్వద్ధామ గా కనిపించినప్పుడు ఏఐ టెక్నాలజీని వాడి అతన్ని క్రియేట్ చేశారు. మరి ఇలాంటి సందర్భంలో యంగ్ లుక్ లో కనిపించడమే కాకుండా తన నటన ప్రతిభను కూడా చూపించి విమర్శకుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఫలితంగా సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా మంచి రికార్డును కూడా క్రియేట్ చేసింది.

ఇక ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా, కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ‘ఆచార్య ‘ సినిమాలో చిరంజీవి యంగ్ లుక్ కోసం ఏఐ టెక్నాలజీని వాడారు. కానీ అది అసలు సెట్ అవ్వలేదు. దాంతో చిరంజీవి చాలా రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏఐ టెక్నాలజీ అందరికీ సెట్ అవ్వదు అని చెప్పడంలో ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు…

చిరంజీవి లాంటి స్టార్ హీరో చిన్నప్పటి ఎపిసోడ్స్ ని ఏఐ టెక్నాలజీలో చేయించడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. అది చూసిన అభిమానులు సైతం అసలు ఏమాత్రం బాగాలేదు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషము…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా తమిళ్ నటుడు విజయ్ హీరోగా వచ్చిన సినిమాలో కూడా విజయ్ యంగ్ క్యారెక్టర్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి తన ఫేసులో యంగ్ లుక్కుని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు.

ఇక ఆ లుక్ తో విజయ్ భారీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. మరి ఇలా కొంతమందికి ఎందుకు ఈ ఏఐ టెక్నాలజీ అనేది సెట్ అవ్వడం లేదు. ఇంకొంత మందికి మాత్రమే ఎందుకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న…ఇక ఏఐ టెక్నాలజీ వల్ల కొన్ని సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం భారీ విమర్శలను ఎదుర్కోక తప్పడం లేదు…