https://oktelugu.com/

Surya: ఆ సూపర్ హిట్ తెలుగు సినిమాను మిస్ చేసుకున్న సూర్య…అది చేసి ఉంటే ఆయన కెరియర్ వేరేలా ఉండేదా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరూ ఎప్పటికప్పుడు వరుస సక్సెస్ లను అందుకుంటూ టాప్ రేంజ్ లోకి వెళ్లిపోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 6, 2024 / 09:50 AM IST

    Surya

    Follow us on

    Surya: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు సూర్య…గజినీ సినిమాతో అటు తమిళ్, తెలుగు రెండు భాషల్లో ఏకకాలంలో మంచి క్రేజ్ ను సంపాదించుకొని తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్న నటుడు కూడా సూర్యనే కావడం విశేషం… రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో ఆ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్న తమిళ నటుడు కూడా సూర్యనే… ఇక ఇలాంటి సూర్య అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగులో స్ట్రైయిట్ గా ఒక సినిమా చేయాలని చాలా వరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది వర్కౌట్ కావడం లేదు. ఇక ఒకానొక సందర్భంలో సూర్య తో తెలుగులో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ముందుకు వచ్చినప్పటికీ సూర్య ఆ కథని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా అనేది పట్టలేక్క లేదు. ఇక దర్శకుడు వేరే హీరోతో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇంతకీ అది ఏ సినిమా అంటే దేశముదురు… అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాని మొదట పూరి జగన్నాథ్ సూర్యతోనే చేయాలనుకున్నాడట. కానీ సూర్య తను ఆ పాత్రను చేయగలడా లేదా అనే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉండి ఆ సినిమాకి నో చెప్పాడట.

    ఫలితంగా పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ తో ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక అప్పటివరకు అల్లు అర్జున్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా కూడా నిలిచింది.ఒకవేళ సూర్య కనక ఆ సినిమా చేసి ఉంటే తెలుగులో ఆయనకి మరింత భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయ్యేది. అలాగే తెలుగు ప్రజలు మరింత తనని ఓన్ చేసుకోవడానికి అవకాశం ఉండేది.

    ఇక ఇప్పటికి తెలుగు హీరోగా చెలామని అవుతున్న సూర్య ఈ ఒక్క సినిమా కనక చేసి ఉంటే మాత్రం ఆయన తెలుగు హీరోలతో పాటుగా సమానమైన క్రేజ్ ను అనుభవిస్తూ ఉండేవాడు… ఇప్పటికి కూడా సూర్య తనదైన రీతిలో సినిమాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘కంగువా ‘ సినిమాతో దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

    ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకొని పాన్ ఇండియాలో తన మార్కెట్ ను భారీ రేంజ్ లో పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటికీ తెలుగు, తమిళంలో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న సూర్య బాలీవుడ్ లో మాత్రం ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధిస్తానని పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు…