NTR: జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఆయన చాలావరకు మంచి సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే కావడం విశేషం…ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ కి మాత్రం పోటీ లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆయన నటనలో గాని, డ్యాన్స్ లో గాని, డైలాగ్ డెలివరీలో గాని తనకు తానే పోటీ అంటూ చాలామంది ట్రేడ్ పండితులు కూడా చెబుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని సక్సెస్ లు సాధించినా కూడా ఒక స్టార్ డైరెక్టర్ మాత్రం అతనికి రెండు భారీ డిజాస్టర్లను అందించాడు. మెహర్ రమేష్ లాంటి దర్శకుడు కంత్రి, శక్తి లాంటి సినిమాలతో రెండు ఫ్లాప్ సినిమాలను అందించినప్పటికీ ఆయన కాకుండా మరొక సీనియర్ దర్శకుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి భారీ డిజాస్టర్ ను అందించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఆయన ఎవరు అంటే బి గోపాల్…
బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సూపర్ సక్సెస్ లను అందించిన ఆయన చిరంజీవికి ఇంద్ర లాంటి ఒక భారీ ఇండస్ట్రీ హిట్ ను అందించాడు. కానీ ఎన్టీయార్ కి మాత్రం అల్లరి రాముడు, నరసింహుడు లాంటి రెండు భారీ డిజాస్టర్ సినిమాలను అందించి ఎన్టీఆర్ కెరియర్ ని భారీగా దెబ్బతీశాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ చాలావరకు ఢీలా పడిపోయాడు.
ఇక అల్లరి రాముడు సినిమాను పక్కన పెడితే నరసింహుడు సినిమాతో మాత్రం ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. మొదటి షో తోనే ఈ సినిమాకి భారీ డిజాస్టర్ టాక్ రావడంతో ఎన్టీఆర్ తెలియని ఒక డైలమాలో పడిపోయాడు. రాజమౌళితో చేసిన సింహాద్రి సినిమా భారీ సక్సెస్ ని అందించింది. ఆ సినిమా తర్వాత వచ్చిన నరసింహుడు సినిమా ప్లాప్ అవ్వడంతో ఎన్టీఆర్ కి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక దాని నుంచి కోలుకోవడానికి ఎన్టీఆర్ కి దాదాపు 5 సంవత్సరాల సమయం పట్టిందంటే మామూలు విషయం కాదు.
ఇలాంటి ఒక రెండు డిజాస్టర్లను అందించిన బి గోపాల్ పేరు చెబితేనే జూనియర్ ఎన్టీఆర్ భయపడిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే ఆయన ఎన్టీయార్ కెరియర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సీనియర్ హీరోలకి సూపర్ సక్సెస్ లను అందించిన బి గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం మొండి చేయి చూపించాడనే చెప్పాలి..