https://oktelugu.com/

Allu Arjun: బాలీవుడ్ లో మల్టీస్టారర్ కి రెడీ అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పున తక్కువే. తన నటనతో, డాన్స్ లతో కేవలం తెలుగు ఇండస్ట్రి లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంకీ గుర్తింపు సంపాదింకుకున్నాడు మన ఐకాన్ స్టార్. గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బన్నీ … త్వరలోనే పుష్ప మూవీ తో ప్రేక్శకుల ముందుకు రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 29, 2021 / 10:01 AM IST
    Follow us on

    Allu Arjun: అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పున తక్కువే. తన నటనతో, డాన్స్ లతో కేవలం తెలుగు ఇండస్ట్రి లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంకీ గుర్తింపు సంపాదింకుకున్నాడు మన ఐకాన్ స్టార్. గత ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బన్నీ … త్వరలోనే పుష్ప మూవీ తో ప్రేక్శకుల ముందుకు రాబోతున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం చేస్తుండగా… రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అయితే టాలీవుడ్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో చిన్న రోల్ చేశాడు తప్ప మల్టీస్టారర్ మూవీ చేయలేదు. కానీ బాలీవుడ్ లో మార్కెట్ కోసం సీరియస్ గా ట్రై చేస్తుండటంతో అక్కడ ఒక మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నాడట.

    ప్రస్తుతం ఈ రూమర్ బీటౌన్ ను షేక్‌ చేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అర్జున్ తో హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో బన్నితో పాటు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ తో జెర్సీ హిందీ రీమేక్ నిర్మించాడు అల్లు అరవింద్. ఈ మూవీని డిసెంబర్ 31న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేషన్ లోనే డెడ్లీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట. రాబోయే రెండు మూడు ఏళ్లలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. ఒక వైపు కబీర్ సింగ్ , మరోవైపు పుష్ప రాజ్ స్క్రీన్ పై ఎలాంటి సినిమాలో కనిపించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.