https://oktelugu.com/

RadheShyam: ‘ఒకే గుండె రెండు చప్పుళ్లు’ సాంగ్​ టీజర్​ ఈరోజే.. తెలుగులో రిలీజ్​ ఎప్పుడో తెలుసా?

RadheShyam: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​. ఓ పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా ప్రమోషన్లపై కాస్త దూకుడు పెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్​డేట్స్​ సినిమాపై మంచి హైప్​ను క్రియేట్​ చేశాయి. మరోవైపు.. ఇటీవలే వచ్చిన ఈ రాతలే పాట మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదో […]

Written By: , Updated On : November 29, 2021 / 10:17 AM IST
Follow us on

RadheShyam: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా రాధేశ్యామ్​. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్​. ఓ పీరియాడికల్​ లవ్​స్టోరీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ సినిమా ప్రమోషన్లపై కాస్త దూకుడు పెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్​డేట్స్​ సినిమాపై మంచి హైప్​ను క్రియేట్​ చేశాయి. మరోవైపు.. ఇటీవలే వచ్చిన ఈ రాతలే పాట మిలియన్ల వ్యూస్​కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదో జోష్​తో మరో పాటను విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.

Radheshyam

వన్ హార్ట్ టూ హార్ట్ బీట్స్ సాంగ్ రిలీజ్​కు సంబంధించి న్యూ ట్వీట్​తో ముందుకొచ్చారు. ఈ పాట విడుదలకు ముందు.. టీజర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ టీజర్​ను మొదట హిందీలో రేపు మధ్యాహ్నం 1గంటకు విడుదల చేయనుండగా.. తెలుగు, తమిళ్​, మలయాళం, కన్నడ భాషల్లో రాత్రి 7 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

గోపి కృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యువి క్రియేషన్స్‌ ద్వారా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ను రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణం రాజు సమర్పిస్తారు. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మాతలు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవర 14న ప్రేక్షకులను పలకరించనుంది ఈ సినిమా.

కాగా, ప్రస్తుతం ఆదిపురుష్​లో ప్రభాస్​ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుంది. మరోవైపు సలార్​ సినిమాతోనూ ఫుల్​ బిజీగా ఉన్నారు ప్రభాస్​.