Mobile phone: రాత్రుళ్లు ఎక్కువసేపు మొబైల్ వాడుతున్నారా.. అయితే ఈ వ్యాధి బారిన పడినట్టే!

Mobile phone: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చేతిలో ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు సెల్ ఫోన్ కేవలం మన దూరపు బంధువులతో మాట్లాడటం కోసం మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం మన జీవితంలో సెల్ ఫోన్ ముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రతి చిన్న పనికి మొబైల్ ఉపయోగించడం వల్ల ఎక్కువగా మొబైల్ వాడకం జరుగుతుంది.ఈ క్రమంలోనే కొందరు అర్ధరాత్రులు వరకు సెల్ ఫోన్ ఉపయోగిస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 2, 2021 7:37 pm

disadvantages-of-using-mobile

Follow us on

Mobile phone: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చేతిలో ఒక్క నిమిషం సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు. ఒకప్పుడు సెల్ ఫోన్ కేవలం మన దూరపు బంధువులతో మాట్లాడటం కోసం మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం మన జీవితంలో సెల్ ఫోన్ ముఖ్యమైనదిగా మారిపోయింది. ప్రతి చిన్న పనికి మొబైల్ ఉపయోగించడం వల్ల ఎక్కువగా మొబైల్ వాడకం జరుగుతుంది.ఈ క్రమంలోనే కొందరు అర్ధరాత్రులు వరకు సెల్ ఫోన్ ఉపయోగిస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఈ విధంగా మొబైల్ ఫోన్ అధికంగా వాడటం వల్ల ఎన్నో సమస్యలు వెంటాడుతాయి.

Mobile phone

Also Read: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో చాలా ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు?

సాధారణంగా రాత్రులు ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడటం వల్ల కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయన్న విషయం మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అయితే తాజాగా స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేయడం వల్ల సరికొత్త విషయాలు బయటపడ్డాయి. అదేంటంటే రాత్రిళ్లు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారు తొందరగా షుగర్ వ్యాధి బారిన పడతారు. అసలు షుగర్ కు మొబైల్ ఫోన్ వాడకానికి సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే….

రాత్రిళ్ళు సెల్ఫోన్ ఉపయోగించడం వల్ల మొబైల్ నుంచి వెలువడిన నీలి రంగు కాంతి మన కళ్ళపై పడినప్పుడు మనకు తీయని పదార్థాలను తినాలనే కోరిక అధికంగా కలుగుతుంది. దీంతో అధికంగా తీపి పదార్థాలను తినడం వల్ల చక్కెర వ్యాధి బారిన పడే అవకాశాలు ఉండటమే కాకుండా అధిక శరీర బరువు పెరుగుతారని శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో వెల్లడించారు. కనుక వీలైనంత వరకు సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించడమే ఉత్తమం అని నిపుణులు వెల్లడించారు.

Also Read: ఈ గింజలు తింటే మధుమేహం కు చెక్ పెట్టవచ్చు.. అవేంటంటే?