IC 814 Web Series: వివాదంలో తమన్నా ప్రియుడి వెబ్ సిరీస్… ప్రభుత్వం సీరియస్, మేకర్స్ చేసిన తప్పేంటి?

నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఓ వెబ్ సిరీస్ వివాదానికి దారి తీసింది. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఆ సిరీస్ లో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ ప్రధాన పాత్ర చేశాడు. కాగా సదరు వెబ్ సిరీస్ ఏమిటీ? ఆ సిరీస్లో వివాదానికి దారి తీసిన అంశం ఏమిటనేది చూద్దాం..

Written By: S Reddy, Updated On : September 4, 2024 5:16 pm

IC 814 Web Series

Follow us on

IC 814 Web Series: డిజిటల్ కంటెంట్ పలుమార్లు వివాదానికి దారి తీస్తుంది. వెబ్ సిరీస్లు, సినిమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సెన్సిటివ్ విషయాల విషయంలో మేకర్స్ జాగ్రత్త తీసుకోకపోవడమే దీనికి కారణం. ఆ మధ్య నయనతార నటించిన అన్నపూర్ణి చిత్రంలోని ఓ సన్నివేశం పై వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ మూవీని నెట్ఫ్లిక్స్ తన ఫ్లాట్ ఫార్మ్ నుండి తొలగించాల్సి వచ్చింది. అలాగే అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ డెబ్యూ మూవీ మహరాజ్ సైతం వివాదం రాజేసింది.

మహరాజ్ మూవీ విడుదలను అడ్డుకోవాలని కోర్టులో వాజ్యం దాఖలైంది. అనేక సవాళ్ళను అధిగమిస్తూ ఆ చిత్రం నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. తాజాగా తమన్నా ప్రియుడు విజయ్ వర్మ ప్రధాన పాత్ర చేసిన ఓ వెబ్ సిరీస్ పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విజయ్ వర్మ, నజీరుద్దీన్ షా, అరవింద స్వామి, దియా మీర్జా, పంకజ్ కపూర్ ప్రధాన పాత్రలు చేసిన చేసిన వెబ్ సిరీస్ ఐసీ 184:ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఐసి 184 సిరీస్ 1999లో జరిగిన ఫ్లైట్ హైజాక్ నేపథ్యంలో రూపొందించారు. ఈ సిరీస్ కి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ దక్కుతుంది. అయితే ఈ సిరీస్లో హైజాకర్స్ పేర్లు వివాదానికి దారితీశాయి. కాందహార్ హైజాక్ వెనకుంది పాకిస్తాన్ ఉగ్రవాదులే అని తెలిసింది. ఈ భారతీయ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇబ్రహీం అక్తర్, సన్నీ ఖాజీ, సాహిద్ సయ్యద్, మిస్త్రీ జహూర్, షాకీర్ హైజాక్ లో పాల్గొన్నారు. వీరి ఫోటోలు కూడా విడుదల చేశారు.

కాగా ఐసి 184 సిరీస్లో ఉగ్రవాదుల పేర్లు మార్చారు. హిందూ పేర్లను హైజాకర్స్ పాత్రలకు పెట్టారు. భోళా, శంకర్, బర్గర్, డాక్టర్… ఇలా కల్పిత పేర్లు పెట్టారు. దీనిపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతీయ ప్రసార బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నెట్ఫ్లిక్స్ కి సమన్లు జారీ చేసింది. హైజాకర్ల పేర్ల మార్పుకు వివరణ ఇవ్వాలని కోరింది. ఐసీ 184: ది కాందహార్ హైజాక్ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.