Raj Tarun: రాజ్ తరుణ్ మొదటి మూడు సినిమాల్లో నేనే హీరోయిన్.. అందుకే చేయలేదు, చాందిని చౌదరి కీలక కామెంట్స్

Raj Tarun: గతంలో చాందిని చౌదరి హీరో రాజ్ తరుణ్ తో కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేసింది. 'ట్రూ లవ్ , ది బ్లైండ్ డేట్ , లవ్ ఎట్ ఫస్ట్ సైట్ , సాంబార్ ఇడ్లీ , ప్రపోజల్, వంటి షార్ట్ ఫిల్మ్స్ లో కలిసి నటించారు.

Written By: S Reddy, Updated On : June 11, 2024 3:01 pm

I was the heroine in Raj Tarun first three films says Chandini Chowdary

Follow us on

Raj Tarun: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ చాందిని చౌదరి. ప్రస్తుతం వరుస ఆఫర్స్ తో సత్తా చాటుతుంది. ఇటీవల విశ్వక్ సేన్ కి జంటగా నటించిన ‘ గామి ‘ చిత్రంతో మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో చాందిని హీరోయిన్ గా నటిస్తుంది. యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి, సంతాన ప్రాప్తిరస్తు సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తుంది. యేవమ్ చిత్రంలో చాందిని చౌదరి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.

ఈ మూవీ జూన్ 14న రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే.. గతంలో చాందిని చౌదరి హీరో రాజ్ తరుణ్ తో కలిసి చాలా షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేసింది. ‘ట్రూ లవ్ , ది బ్లైండ్ డేట్ , లవ్ ఎట్ ఫస్ట్ సైట్ , సాంబార్ ఇడ్లీ , ప్రపోజల్, వంటి షార్ట్ ఫిల్మ్స్ లో కలిసి నటించారు. ఇవి ఇద్దరికీ మంచి పేరు తెచ్చిపెట్టాయి. కేటుగాడు సినిమాతో చాందిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

Also Read: Bollywood Actress: సినిమాలు తక్కువే.. కానీ సంపాదన అదుర్స్..

ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, బ్రహ్మోత్సవం, లై వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. కాగా కలర్ ఫోటో సినిమాతో చాందిని మొదటి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా కి జాతీయ అవార్డు రావడం విశేషం. రీసెంట్ గా విడుదలైన గామి సినిమా విజయం కావడంతో ఫుల్ జోష్ లో ఉంది. కాగా ఓ ఇంటర్వ్యూలో చాందిని చౌదరి కి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఇప్పటివరకు రాజ్ తరుణ్ తో ఒక్క సినిమాలో కూడా నటించకపోవడానికి కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించారు.

Also Read: BB4: బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో నటించనున్న యంగ్ హీరో…

సమాధానంగా చాందిని చౌదరి మాట్లాడుతూ .. కారణం ఏమీ లేదు. రాజ్ తరుణ్ తో కలిసి నటించడానికి ఆఫర్స్ రాలేదు. కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి కానీ… అనుకోని పరిస్థితుల వల్ల కుదరలేదు. రాజ్ తరుణ్ నటించిన మొదటి మూడు సినిమాల్లో నన్నే హీరోయిన్ గా అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలు చేయలేదు అంతే. ఇప్పటికీ మేము టచ్ లోనే ఉంటాం అని చాందిని చౌదరి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.