https://oktelugu.com/

BB4: బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో నటించనున్న యంగ్ హీరో…

BB4: ఇప్పుడు కూడా అదే పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

Written By:
  • Gopi
  • , Updated On : June 11, 2024 / 11:41 AM IST

    Kiran Abbavaram play a key role in Balakrishna-Boyapati BB4

    Follow us on

    BB4: నందమూరి నటసింహం అయిన బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా ‘బిబి 4’ అంటూ బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చే నాలుగో సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. అయితే ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాల్లో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో నటించాడు.

    ఇక ఇప్పుడు కూడా అదే పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక యంగ్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరో ఎవరు అనే దానిమీద సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లైతే వస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కిరణ్ అబ్బవరంను ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం బోయపాటి శ్రీను తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక కిరణ్ అబ్బవరం కు కూడా ప్రస్తుతానికి హిట్లు ఏమీ లేవు కాబట్టి ఆయన కూడా బోయపాటి డైరెక్షన్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ పాత్ర ఏంటి అనేది సినిమా యూనిట్ రివీల్ అయితే చేయలేదు.

    Also Read: Tejaswini: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య చిన్న కూతురు… మోక్షజ్ఞ కోసం చూస్తుంటే ఇదేం ట్విస్ట్!

    కానీ అది సినిమాలో ఒక కీలక పాత్ర అయి ఉంటుంది అని చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ యంగ్ హీరో బాలయ్య కాంబినేషన్ లో నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు ఈ న్యూస్ పైన క్లారిటీ అయితే లేదు.

    Also Read: Pushpa 2: పుష్ప 2 కు పోటీగా వస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో…ఇలా చేస్తే ఎవరికి నష్టం..?

    కానీ అందుతున్న సంవత్సరం ప్రకారం కిరణ్ అబ్బవరం ను ఈ సినిమాలో తీసుకుంటున్నారు అంటూ విపరీతమైన వార్తలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది…ఇక ఈ సినిమాతో బోయపాటి మరోసారి బాలయ్య బాబుకి సూపర్ సక్సెస్ ని అందించి ఇక వీళ్ళ కాంబో లో రాబోయే డబుల్ హ్యాట్రిక్ హిట్లకు పునాదిని వేస్తారా అనేది తెలియాల్సి ఉంది…