Bollywood Actress: సినిమాలు తక్కువే.. కానీ సంపాదన అదుర్స్..

Bollywood Actress: తల్లి వారసత్వంతోని వచ్చిన ఓ ముద్దుగుమ్ము ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించింది. త్వరలో తెలుగులో కూడా అడుగుపెట్టబోతుంది. అయితే ఈ భామ చేసిన సినిమాలు తక్కువే. కానీ ఖరీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయి.

Written By: Chai Muchhata, Updated On : June 11, 2024 10:24 am

Bollywood Actress Janvi Kapoor

Follow us on

Bollywood Actress: సినీ ఇండస్ట్రీ లైఫ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఎన్నో ఆశలతో, ఉత్సాహంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొందరికి వచ్చీ రాగానే.. అవకాశాల పంట పండుతుంది. మరికొందరు ఏళ్ల తరబడి ఈదుతున్నా సరైన గుర్తింపు రాదు. ఈ క్రమంలో చాలా నేటి కాలంలో చిత్ర పరిశ్రమ అంటే భయపడుతున్నారు. కానీ తండ్రులు, తల్లులు సినిమాల్లో కొనసాగుతున్న వారు తమ వారసులు మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలనాడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ఓ మెరుపు తారు కూతురు సినిమా పరిశ్రమలోకి వచ్చి చాన్నాళ్లే అవుతోంది. అయితే ఈ భామ చేసిన సినిమాలు తక్కవే.. కానీ సంపాదనలో మాత్రం అదుర్స్ అనిపించుకుంటోంది. ఇంతకీ ఈ భామ ఎవరో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే ఆషా మాషీ కాదు. ఎంతో ప్రావీణ్యం ఉండాలి. అందం చందంతో పాటు అణుకువగా ఉండాలి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్లాలి. తల్లి వారసత్వంతోని వచ్చిన ఓ ముద్దుగుమ్ము ఇప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించింది. త్వరలో తెలుగులో కూడా అడుగుపెట్టబోతుంది. అయితే ఈ భామ చేసిన సినిమాలు తక్కువే. కానీ ఖరీదైన బంగ్లాలు, కార్లు ఉన్నాయి. ఎందుకంటే ఈమె చేసిన సినిమాలకు భార రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.

అ సుందరి ఎవరో కాదు జాన్వీ కంపూర్.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దడక్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో అవకాశాలను తెచ్చుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే అడ్వర్టయిజ్మెంట్లలోనే ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జాన్వీ సంపాదన మూడు పూవులు, ఆరుకాయలు అన్నట్లుగా వర్దిల్లింది. అంతేకాకుండా హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్నట్లు సమాచారం.

దీంతో జాన్వీ సంపాదన అంతకంతకు పెరిగిపోతోంది. ప్రస్తుతం జాన్వీ వయసు 27. కానీ ఈమె దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయి. లగ్జరీ కార్లు ఉన్నాయి. ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి. అయితే ఎంత ఆస్తి ఉన్నా జాన్వీ ఆరోగ్యం విషయంలో మాత్రం కేర్ తీసుకుంటుంది. ఆమె ఎక్కువగా ఫనీర్ భుర్జీ తీసుకుంటుంది. రాత్రం భోజనం కోసం చేసిన సూర్, చేపలు, చపాతీలు ఎక్కువగా తీసుకుంటుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈమె చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.