https://oktelugu.com/

Puri Jagannath: ‘పోకిరి’ లో అసలు ఏముందని ప్రేక్షకులు అంతలా చూసారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు: పూరి జగన్నాథ్

ఒక ఇంటర్వ్యూలో పూరీ జగన్నథ్ మాట్లాడుతూ.. పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని మీరు భావించారా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘నేను కానీ, మహేష్ బాబు కానీ పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. మంచి సినిమా అవుతుంది. ఆడుతుంది అనే నమ్మకం అయితే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 6, 2024 / 06:22 PM IST

    Puri Jagannath

    Follow us on

    Puri Jagannath: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏ను మలుపు తిప్పిన సినిమా పోకిరి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. ఈ చిత్రానికి ముందు ఆయన తీసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 2006న ఈ మూవీ గ్రాండ్‏గా రిలీజ్ అయ్యి వసూళ్ల పరంగా రికార్డ్స్ సృష్టించింది. రూ. 10 కోట్ల బడ్జెట్‏తో నిర్మించిన ఈ సినిమా రూ. 70 కోట్ల గ్రాస్.. రూ. 40 కోట్ల షేర్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినమాకు సంబంధించిన ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు ఈ సినిమా గురించి పూరీ మాట్లాడిన మాటలు షేర్ అవుతున్నాయి.

    ఒక ఇంటర్వ్యూలో పూరీ జగన్నథ్ మాట్లాడుతూ.. పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని మీరు భావించారా? అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘నేను కానీ, మహేష్ బాబు కానీ పోకిరి అంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. మంచి సినిమా అవుతుంది. ఆడుతుంది అనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే, నా దగ్గర ఉన్న కథల్లో అది కూడా ఒకటి. పోకిరి తర్వాత ఆ రేంజ్ మూవీ నా నుండి రాలేదని విమర్శలు ఉన్నాయి దాంతో మూడేళ్ళ తర్వాత అసలు నేను ఏం తీశానా? అని ప్రసాద్ ల్యాబ్స్ లో పోకిరి మూవీ వేసుకుని చూశాను. నాకేమి అర్థం కాలేదు. సినిమా ఫలితం గురించి ఎవరికీ తెలియదు. ఏ సినిమా నచ్చుతుందో, ఏ సినిమా నచ్చదో చెప్పలేము. పోకిరి ఎందుకు ఆడిందో నాకు కూడా తెలియదు’’ అని చెప్పారు.

    పూరి తన తొలి చిత్రం బద్రి కన్నా ముందే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నారట. ఇక ఈ మూవీ కోసం హీరోలుగా పవన్ కళ్యాణ్, రవితేజలను అనుకున్నారట. అలాగే ఈ చిత్రానికి ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్య నారాయణ అనే టైటిల్స్ ఫిక్స్ చేసుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా కార్యరూపం దాల్చలేదని..ఆ తర్వాత మహేష్ కోసం ఈ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి పోకిరి పేరుతో ఈ సినిమాను రిలీజ్ చేశారట పూరి. అలాగే ఈ సినిమాకు మహేష్ సరసన అనుకున్న హీరోయిన్ ఇలియానా కూడా కాదు..ఆ స్థానంలో సూపర్ హిరోయిన్ అయేషా టకియాను సెలక్ట్ చేసుకున్నారని.. కానీ ఆమె ఆ పాత్రను వదులకోవడంతో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ సెలక్ట్ చేశారు. కానీ అదే సమయంలో బాలీవుడ్ సినిమా గ్యాంగ్ స్టర్ మూవీకి కూడా అడిషన్స్ జరగడంతో.. ఈ రెండు చిత్రాల్లో సెలక్ట్ అయ్యింది.
    అయితే కేవలం ఒక సినిమా మాత్రమే చేయాలని కండీషన్ ఉండడంతో కంగనా పోకిరి చిత్రాన్ని వదులుకుంది. ఇక ఆ తర్వాత దేవదాసు బ్యూటీ ఇలియానకు ఈ అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్, పూరి కాంబోలో వచ్చిన బిజినెస్ మెన్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.