https://oktelugu.com/

Srinu Vaitla: రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ చిత్రాన్ని కావాలని తొక్కేశారు..వచ్చిన వసూళ్లు ఇవే అంటూ డైరెక్టర్ శ్రీనువైట్ల షాకింగ్ కామెంట్స్!

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బ్రూస్ లీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ కాదు, పెట్టిన బడ్జెట్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి లాభాలు బాగానే వచ్చాయి. కొన్ని మీడియా చానెల్స్ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినట్టు అసత్యాలను ప్రచారం చేసారు. సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వకపోయినా మెగా అభిమానులకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం.

Written By:
  • Vicky
  • , Updated On : October 6, 2024 / 06:27 PM IST

    Srinu Vaitla(1)

    Follow us on

    Srinu Vaitla: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. టాలీవుడ్ లో అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న అతి తక్కువ మంది స్టార్ డైరెక్టర్స్ లో ఈయన ఒకడు. కామెడీకి కేరాఫ్ అడ్రస్ లా అనిపిస్తాయి. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ తర్వాత ఆ స్థాయిలో కామెడీ జానర్ చిత్రాలను తెరకెక్కించిన ఘనత శ్రీను వైట్ల కి చెందుతుంది. అయితే ఈ క్రేజీ డైరెక్టర్ కి ‘దూకుడు’ తర్వాత ఆ స్థాయి హిట్ లేకపోవడం, ఈమధ్య చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడంతో స్టార్ హీరోలు ఈయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించేశారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా విశ్వంతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు శ్రీనువైట్ల. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తాజాగా విశ్వం ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ బ్రూస్ లీ గురించి మాట్లాడారు.

    ఆయన మాట్లాడుతూ “ఎన్నో అంచనాల మధ్య వచ్చిన బ్రూస్ లీ బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ని సాధించలేకపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ చిత్రం కమర్షియల్ ఫ్లాప్ కాదు, పెట్టిన బడ్జెట్ కి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి లాభాలు బాగానే వచ్చాయి. కొన్ని మీడియా చానెల్స్ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యినట్టు అసత్యాలను ప్రచారం చేసారు. సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వకపోయినా మెగా అభిమానులకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే పదేళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ ని రీ లాంచ్ ఈ సినిమా ద్వారా చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ సినిమా ఎంట్రీ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చిరంజీవి గారికి ఈ సినిమా కోసం నేను చేయించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుతుంటారు. చిరంజీవి, రామ్ చరణ్ ని ఒకే స్క్రీన్ పైన చూసిన అభిమానులకు ఒక కనుల పండుగ ఈ చిత్రం. ఆయన వెండితెర పై కనిపించింది కాసేపే అయినా ఈ చిత్రం పై మంచి ప్రభావం చూపించింది . ఓపెనింగ్స్ కి కూడా ఆ సన్నివేశం బాగా ఉపయోగపడింది’’ అని శ్రీను వైట్ల తెలిపారు.

    ఇక తన సినిమాలు ప్లాప్ అవ్వడం గురించి శ్రీను మాట్లాడుతూ.. ‘‘మూవీ మేకింగ్‌ స్టైల్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కాకపోతే, థీమ్‌లు రిపీట్‌ అవుతున్నాయని వారు ఫీలవుతున్నారు. అందుకే గ్యాప్‌ తీసుకుని వర్క్‌ చేశా. లేటెస్ట్ గా నడుస్తున్న ట్రెండ్ కి నా స్టైల్ టేకింగ్ తో సినిమా తీస్తే సక్సెస్ అవుతుందని నమ్మి ఈ సినిమా చేశాను. అందుకు నాకు చాలా సమయామే పట్టింది. రవితేజ హీరోగా ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ కూడా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడున్న సమయంలో కన్ఫ్యూజన్‌తో తీసుకున్న నిర్ణయం అది. ఆ సినిమా ద్వారా నిర్మాతలకు లాభాలు వచ్చాయి. కానీ, ఆ సినిమా రిజల్ట్‌ ప్రభావం నాపై పడింది’’ అని చెప్పారు.