https://oktelugu.com/

నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్‌ కామెంట్స్‌

సుశాంత్‌ సూసైడ్‌ కేసును విచారిస్తున్న పోలీసులు డ్రగ్స్‌ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చారు. దీంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. ఇప్పుడు ఆ కేసు టాలీవుడ్‌నూ షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాను అరెస్టు చేయగా.. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: ‘రేణు దేశాయ్’ సక్సెస్ అయితే.. అకీరాని కూడా.. ! కాగా.. ఈ కేసులో రోజుకో పేరు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌‌ హీరోయిస్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 23, 2020 / 10:06 AM IST

    bandla mamrata

    Follow us on


    సుశాంత్‌ సూసైడ్‌ కేసును విచారిస్తున్న పోలీసులు డ్రగ్స్‌ రాకెట్‌ను వెలుగులోకి తెచ్చారు. దీంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. ఇప్పుడు ఆ కేసు టాలీవుడ్‌నూ షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియాను అరెస్టు చేయగా.. చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.

    Also Read: ‘రేణు దేశాయ్’ సక్సెస్ అయితే.. అకీరాని కూడా.. !

    కాగా.. ఈ కేసులో రోజుకో పేరు వెలుగులోకి వస్తుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్‌ స్టార్‌‌ హీరోయిస్‌ దీపికా పదుకునే పేరు వెలుగులోకి రాగా.. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌‌ స్టార్‌‌ మహేశ్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌‌ పేరు తెరపైకి వచ్చింది. జాతీయ మీడియా, నార్కోటిక్స్‌ బ్యూరో అధికారుల విచారణలో దొరికిన వ్యక్తుల వాట్సాప్‌చాట్‌లో నమ్రత పేరు ఉందనే కథనాలు వెలువరించింది.

    ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. నిజనిజాలు ఎలా ఉన్నా.. మీడియాలో, సోషల్‌ మీడియాలో హాట్‌హాట్‌గా మారింది. మరోపక్క మహేశ్‌బాబు అభిమానులు ఈ వార్తలను ఖండిస్తున్నారు.

    అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ ఈ విషయంపై స్పందించారు. ‘నమ్రత నాకు 15 ఏళ్లుగా తెలుసు. ఆమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమె గొప్ప భార్య, గొప్ప తల్లి, ఆమెను నేను గౌరవిస్తాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

    కొద్ది రోజుల క్రితం స్టార్‌‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు కూడా బయటకు రావడంతో పెద్ద దుమారం రేపింది. దీంతో ఆమె నేరుగా ఢిల్లీ వెళ్లారు. మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ వేశారు. కోర్టు కూడా ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఈ డ్రగ్స్‌ మున్ముందు మరెందరిని వెలుగులోకి తెస్తుందో అర్థం కాకుండా ఉంది.