Senior Actor Naresh: గత రెండేళ్లుగా వ్యక్తిగత విషయాలు, వివాదాలతో నరేష్ వార్తల్లో ఉంటున్నారు. ఆయన నటి ప్రవిత్ర లోకేష్ తో గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. పవిత్ర లోకేష్- నరేష్ కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఆయన నాలుగో వివాహం చేసుకున్నారని ప్రచారం జరిగింది. మేము కలిసి జీవిస్తున్నాం. వివాహం అయితే చేసుకోలేదని నరేష్ క్లారిటీ ఇచ్చాడు.
ఈ క్రమంలో మూడో భార్య రమ్య రఘుపతి సీన్లోకి వచ్చింది. పవిత్ర లోకేష్ తో నరేశ్ బంధాన్ని ఆమె వ్యతిరేకిస్తున్నారు. మైసూర్ లో ఓ హోటల్ రూమ్ లో పవిత్ర లోకేష్, నరేష్ ఉన్న విషయం తెలుసుకుని గది ముందు బైఠాయించింది. అక్కడ హైడ్రామా చోటు చేసుకోగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. నరేష్-రమ్య ఒకరిపై మరొకరు దారుణమైన ఆరోపణలు చేసుకున్నారు. రమ్య రఘుపతిని ఎండగడుతూ మళ్ళీ పెళ్లి టైటిల్ తో నరేష్-పవిత్ర ఓ మూవీ చేశారు.
ఈ చిత్ర విడుదలను రమ్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇలా రమ్య రఘుపతిలో నరేష్ కి గొడవలు జరుగుతున్నాయి. పవిత్ర లోకేష్ తో ఆయన సహజీవనం కొనసాగుతుంది. తాజాగా వీరిద్దరూ ఓ టెలివిజన్ షోకి వచ్చారు. నరేష్ నటుడిగా 50 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన్ని సన్మానించారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ… 50 ఏళ్ల ప్రస్థానం పూర్తి అయ్యింది. ప్రొఫెషనల్ గా పర్సనల్ గా జీవితంలో అనేక ఒడిదుడుకులు. గతంలో చేసిన కొన్ని తప్పుల కారణంగా బాధపడుతున్నాను… అన్నారు.
బహుశా ఆయన రమ్య రఘుపతితో వివాహం గురించి ఈ కామెంట్స్ చేసి ఉండొచ్చు. రమ్య రఘుపతితో జరుగుతున్న కోర్టు వివాదాల్లో ఈ మధ్య నరేష్ కి ఊరట లభించింది. నరేష్ ఇంట్లోకి ఆమెకు ప్రవేశం లేదని తీర్పు ఇచ్చింది. రమ్య రఘుపతికి ఒక కొడుకు. తన కొడుకు భవిష్యత్ కోసం నరేష్ తోనే నేను ఉండాలని అనుకుంటున్నాని రమ్య అంటున్నారు. ఆమె వద్ద నా కొడుక్కి భద్రత లేదని నరేష్ వాదన.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: I made a mistake and i am not happy nareshs shocking comments is that the reason
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com