https://oktelugu.com/

SS Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’లో నాకు ఆ పాత్రే ఎక్కువ ఇష్టం – రాజమౌళి

SS Rajamouli: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ను అద్భుతంగా ప్రమోట్ చేశారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అయినా సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ.. రాజమౌళి ఏమి మాట్లాడాడు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 25, 2022 / 10:47 AM IST
    Follow us on

    SS Rajamouli: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ అంటూ ‘ఆర్ఆర్ఆర్’ను అద్భుతంగా ప్రమోట్ చేశారు. కానీ కరోనా మూడో వేవ్ కారణంగా సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ అయింది. మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. అయినా సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన వీడియోలు ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి.

    SS Rajamouli with NTR and Charan

    ఇంతకీ.. రాజమౌళి ఏమి మాట్లాడాడు అంటే.. రాజమౌళి మాటల్లోనే.. ‘నాకు ఇద్దరు హీరోలు చేసిన పాత్రలు ఇష్టమే. అయితే, అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల పాత్రల్లో ఏ పాత్ర ఎక్కువ ఇష్టం అంటే మాత్రం.. చరణ్ చేసిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఒకింత ఎక్కువ ఇష్టం. ఆ పాత్రలో ఎమోషన్ బాగుంటుంది’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

    Also Read: డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తింటే అస్సలు వదిలిపెట్టరు!

     

    SS Rajamouli

    ఇక చరణ్ అభిమానులు అయితే, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ అంటేనే గొప్ప దేశభక్తులు. మరి వారి పాత్రల్లో ఇద్దరు మాస్ హీరోలు.. పైగా వారికి ప్రేమకథలు. అల్లూరి, కొమురం భీమ్‌ నుండి ప్రేక్షకులు దేశభక్తినే కోరుకుంటారు. దేశ భక్తితో పాటు ప్రేక్షకుడిని మెప్పించటానికి అన్ని కమర్షియల్ అంశాలను జోడించాలి. మరి సినిమాని ఎలా హ్యాండిల్ చేశారో చూడాలి. మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

    Also Read: పెళ్లితో కరోనా, సోనాక్షి క్రేజీ కామెంట్స్.. మరో 3 బెస్ట్ అవార్డులతో “జై భీమ్” !

    Tags