SSY Scheme: కేంద్ర ప్రభుత్వం వేర్వేరు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు మంచి రాబడిని అందిస్తున్న సంగతి తెలిసిందే. పోస్టాఫీస్ స్కీమ్స్ లో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా కనీసం 1,000 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులో 18 సంవత్సరాల తర్వాత కొంత మొత్తం తీసుకునే అవకాశం ఉండగా పెళ్లి సమయంలో మిగిలిన మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మెచ్యూరిటీ వరకు సుకన్య సమృద్ధి స్కీమ్ ను కొనసాగించిన వాళ్లు ఈ స్కీమ్ ద్వారా ఏకంగా 71 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పది సంవత్సరాల లోపు ఆడపిల్లల పేర్లపై మాత్రమే ఈ స్కీమ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది.
Also Read: ఇంట్లో కూర్చుని నెలకు రూ.60 వేలు సంపాదించవచ్చు.. ఎలా అంటే?
తల్లిదండ్రులు గరిష్టంగా ఇద్దరు కూతుళ్ల పేర్లపై సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరిచే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 15 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఈ మొత్తం పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నెలకు 12,500 రూపాయల చొప్పున 15 సంవత్సరాల పాటు ఖాతాను కొనసాగిస్తే కచ్చితంగా ఈ మొత్తాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇతర స్కీమ్స్ తో పోల్చి చూస్తే సుకన్య సమృద్ధి స్కీమ్ ఉత్తమమైన స్కీమ్ అవుతుందని చెప్పవచ్చు
Also Read: ఎల్ఐసీ పాలసీదారులకు ఫ్రీగా క్రెడిట్ కార్డులు.. ఎలా పొందాలంటే?