https://oktelugu.com/

Keerthi Suresh Sakhi Movie: ‘సఖి’కి డిమాండ్ పెరిగింది.. 24 గంటల్లో 5 మిలియన్లు !

Keerthi Suresh Sakhi Movie: జాతీయ అవార్డు గ్రహీత, కీర్తి సురేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కేవలం 24 గంటల లోపే 5 మిలియన్ల వీక్షణలను సాధించింది. అంతేకాకుండా, ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 2వ స్థానంలో నిలిచింది. ‘కీర్తి సురేష్’ మెయిన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 25, 2022 / 10:41 AM IST
    Follow us on

    Keerthi Suresh Sakhi Movie: జాతీయ అవార్డు గ్రహీత, కీర్తి సురేష్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘గుడ్ లక్ సఖి’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కేవలం 24 గంటల లోపే 5 మిలియన్ల వీక్షణలను సాధించింది. అంతేకాకుండా, ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో 2వ స్థానంలో నిలిచింది.

    Keerthi Suresh Sakhi Movie

    ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. నగేష్ కుకునూరు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ జర్నీని చాలా బాగా చూపించారట. అయితే, ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అయి ఏడాది గడిచింది. ‘కీర్తి సురేష్’ సోలో సినిమాలన్నీ ప్లాప్ లు అవ్వడం, కరోనా సెకెండ్ వేవ్ లాక్ డౌన్ తో ‘గుడ్ లక్ సఖి’ సినిమా కొనడానికి ఏ బయ్యరు ముందుకు రాలేదు.

    Also Read: ఎన్టీఆర్, బన్నీ తర్వాత బాలయ్యతోనే.. ?

     

    Keerthi Suresh Sakhi Movie

    పైగా డిజిటల్ అండ్ టీవీ శాటిలైట్ రైట్స్ కూడా ఇంతవరకు అమ్ముడుపోలేదు. సినిమా రిలీజ్ అయి హిట్ అయితేనే, ఈ సినిమా రైట్స్ కి డబ్బులు వస్తాయి. లేదు అంటే.. ఈ సినిమా వల్ల నిర్మాతలకు భారీ నష్టాలూ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. జనవరి 28న ‘గుడ్‌ లక్ సఖి’ సినిమా విడుదల కాబోతుంది. మరి ప్రమోషన్స్‌ ను వేగవంతం చేస్తే.. ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

    Also Read:  వైరల్ అవుతున్న కాజల్ అగర్వాల్ బేబీ బంప్ !

    Tags