Dhanush struggled days: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఎవరు ఏ భాషలో సినిమా చేసినా కూడా దేశంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాను చూసి ఎలా ఉంది ఆ సినిమా సక్సెస్ ని సాధించిందా? లేదా అనే జడ్జిమెంట్ అయితే ఇస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ధనుష్…ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కొట్టు’ అనే సినిమాని చేశారు. ఈ సినిమా అక్టోబర్ 1 వ తేదీన రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చేపట్టారు. అక్టోబర్ 1 అంటే దసర కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ధనుష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. చిన్నప్పుడు తను ఇడ్లీ తిందామనుకున్న సమయంలో తన దగ్గర డబ్బులు లేవని ఇప్పుడు తినడానికి డబ్బులు ఉన్నా కూడా ఇడ్లీ కొట్టులో కానీ హోటల్ లో కాని ఆ టేస్ట్ అయితే రావడం లేదని చెప్పాడు.
తినాల్సిన టైంలో డబ్బులు లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయమని చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఉంటుందని యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి ఈ సినిమా నచ్చుతుందని తను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
ఇక ఇప్పటికే ఈ సంవత్సరంలో ‘కుబేర’ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన ఆయన ఇప్పుడు ఇడ్లీ కొట్టు సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.తను అనుకుంటున్నాట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక తను వెట్రి మారన్ దర్శకత్వంలో ‘వడ చెన్నై’ మూవీకి సీక్వెల్ ను కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలియజేశాడు. ధనుష్ ఇప్పటికే ఈ సంవత్సరంలో చాలా సినిమాలను రిలీజ్ చేశాడు. కాబట్టి తన తదుపరి సినిమాల విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళుతుండటం విశేషం…