Strongest army in the world: ఇజ్రాయిల్ , పాలస్తీనా యుద్ధం.. రష్యా, ఉక్రెయిన్ పోరు.. ఇటీవల మన దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పోరాటంలో ఏ దేశం గెలుస్తుందో.. ఏ దేశం ఓడుతుందో చెప్పలేం. కానీ చిన్న దేశం.. పెద్ద దేశం అని చూడకుండా దేశాల మధ్య యుద్ధం అయితే కొనసాగుతోంది. కొన్ని చిన్న దేశాలకు ఇతర దేశాలు సపోర్టుగా నిలుస్తూ సైనికులను అందిస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఇతర సైనిక అవసరాలను తీరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఏ దేశం వద్ద ఉంది? అన్న ప్రశ్న తలెత్తింది. దీంతో గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 140 దేశాల సైనికుల ర్యాంకింగ్ ను రిలీజ్ చేసింది. మరి ఇందులో అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశం ఏదో ఇప్పుడు చూద్దాం.
ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి కలిగి ఉన్న దేశం అమెరికానే నిలిచింది. ఈ దేశం సుమారు 20 లక్షలకు పైగా సైనికులను కలిగి ఉన్నట్లు అంచనా. వీరిలో 8 లక్షలకు పైగా రిజర్వు సైనికులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరిలో వేగంగా స్పందించే బలగాలు, డ్రోన్లు నిర్వహించేవారు ఉంటారు. అతిపెద్ద సైనికులను కలిగి ఉన్న రెండవ దేశం రష్యా. ఈ దేశం మొత్తం 30 లక్షల వరకు సైనిక శక్తిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 25 లక్షల వరకు రిజర్వ్ సైనికులు ఉంటారు. సైనిక శక్తి కలిగిన టాప్ త్రీ లో చైనా దేశం ఉంది. ఆసియాపరంగా చూస్తే అతిపెద్ద దేశంగా పేర్కొంటుంది. ఈ దేశం మొత్తం 30 లక్షల సైనికులను కలిగి ఉండగా వీరిలో ఐదు లక్షల వరకు రిజర్వ్ సైనికులు ఉంటారు. అలాగే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భూ సేన, నౌకాదళం, వైమానిక దళం, రాకెట్ ఫోర్స్ వంటివి మీరు సైనిక విభాగాల్లో ఉంటారు.
ప్రపంచంలో అతిపెద్ద సైనిక ర్యాంకింగ్లో భారతదేశ నాలుగవ స్థానంలో ఉంది. భారత్లో 3 విభాగాల సైనికులు ఉంటారు. వీరిలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అనే మూడు ప్రధాన శాఖలు పనిచేస్తాయి. మొత్తం 30 లక్షలకు పైగా సైనికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో రిజర్వు సైనికులు 12 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ తర్వాత దక్షిణ కొరియా అతిపెద్ద సైనిక వ్యవస్థను కలిగి ఉన్నట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ తెలిపింది.
అయితే సైనిక వ్యవస్థ ఎలా ఉన్నప్పటికీ.. యుద్ధం విషయంలో కొన్ని దేశాలు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటాయి. అధునాతన విమానయానం.. రాఫెల్ వంటి యుద్ధ విమానాలను కలిగి ఉన్న దేశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను వాడుకుంటూ ఉంటారు. అయితే వీటి నిర్వహణకు సైనిక వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది.